తె-వాదులకు ఆకుల్లో, సీమాంధ్రులకు కంచాల్లో

తె-వాదులకు ఆకుల్లో, సీమాంధ్రులకు కంచాల్లో

తెలంగాణ రాష్ట్రాన్ని కోరుతూ తెలంగాణలోని కాంగ్రెస్‌ నాయకులు ఇక్కడ తెలంగాణ సాధన సభను ఏర్పాటు చేశారు. అయితే దీనికి ధీటుగా సమైక్య సభ ఏర్పాటు చేయాలని సీమాంధ్ర నాయకులు అనుకున్నారు. అయితే ఈ సభను అధిస్ఠానం వద్దంటుంది కాబట్టే పెట్టడం లేదని లీకులొస్తున్నాయి. తె కాంగ్రెస్‌ సభకు అధిష్ఠానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని దామోదర బల్లగుద్ది చెప్పారు. వారి అనుమతితోనే ఈ సభను పెడుతున్న విలేకరుల సమావేశంలో చెప్పారు. కానీ సమైక్య సభకు మాత్రం అధిష్ఠానం రెడ్‌ సిగ్నల్‌ వేసింది. అయినా వారికి అకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నట్లు ఉంది కాంగ్రెస్‌ తీరు. సమైక్య సభకు హాజరవుదామని అనుకున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు దానం, ముఖేష్‌, ప్రభుత్వ విప్‌ జగ్గారెడ్డిలాంటి ఇతర నాయకుల ఆశలపై నీరు చల్లినట్లైంది.

సీమాంధ్ర వారు నిర్వహించదలచుకున్న సభలకు అధిష్ఠానం సైంధవ పాత్ర పోషించడం అనేది.. ఆ ప్రాంతానికి చెందిన నాయకులకు తీవ్రమైన ఆగ్రహం తెప్పిస్తోంది. తెలంగాణ వాదులు వేర్పాటు వాదంతో సభ నిర్వహించినప్పుడు మాత్రం.. అనుమతి ఇచ్చిన అధిష్ఠానం పెద్దలు తాము సమైక్యాంధ్ర సభ నిర్వహించాలంటే మాత్రం.. వద్దంటూ హెచ్చరికలు జారీచేయడం చాలా తప్పు అని వారు భావిస్తున్నారు. ఇలా అయితే.. తమ ప్రాంతంలో ప్రజల వద్ద తాము మొహం ఎత్తుకుని తిరగడం కష్టం అని వారు భావిస్తున్నారు.

ఇప్పటికే సీమాంధ్ర నాయకులు అచేతనంగా వ్యవహరిస్తున్నారని.. ఏదో తెలంగాణ గొడవ రేగినప్పుడు కాస్త సమైక్యం అంటూ హడావిడి  చేయడం తప్ప మరేమీ నిర్మాణాత్మకంగా పనిచేయడం లేదని విమర్శలు ఉన్నాయి. దానికి తగినట్లు కొండంత రాగం తీసి.. రాష్ట్రవ్యాప్తంగా సమైక్య సభలు నిర్వహిస్తామని ప్రకటిస్తే.. తొలిసభకే హంసపాదు ఎదురు కావడం వారికి మనస్తాపం కలిగిస్తోంది.

అధిష్ఠానం సభలకు బ్రేకు వేస్తే వేసింది గానీ.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచితేచాల్లెమ్మని వారు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు