కొండా దంపతులకు బిజెపి గాలం

కొండా దంపతులకు బిజెపి గాలం

వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు నేత కొండా సురేఖ, ఆమె భర్త కొండా మురళి కొన్నాళ్ళ నుంచి ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో వారిని తమవైపు తిప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కొండా సురేఖతో మాట్లాడి తమ పార్టీలోకి ఆహ్వానించార్ట. దీనిపై ఇంకా కొండా సురేఖగాని, కిషన్‌రెడ్డిగాని ఎలాంటి వివరణ ఇవ్వకపోయినప్పటికీ కొండా సురేఖ బిజెపిలోకి వెళ్ళడం ఖాయమంటున్నారు. ఈ రోజు ఉదయమే వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ నుంచి కొండా సురేఖ వర్గీయులు నలుగుర్ని సస్పెండ్‌ చేయడం జరిగింది. ఆ వెంటనే కిషన్‌రెడ్డి, కొండా సురేఖను తమ పార్టీలోకి ఆహ్వానించారన్న వార్త ఆసక్తికరంగానే ఉంది.

కాంగ్రెసు పార్టీ నుంచి జగన్‌ కోసం బయటకు వచ్చిన కొండా సురేఖ, మంత్రి పదవినీ జగన్‌ కోసమే వదులుకున్నారు. పరకాల ఉప ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. క్రమంగా పార్టీలో తనను ఎవరూ పట్టించుకోవడంలేదన్న ఆవేదనతో ఆమె పార్టీని వీడాలనే ఆలోచనతో ఉన్నట్లుగా సమాచారం అందుతున్నది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు