సత్తిబాబు సమైక్యవాది ఎలాగయ్యాడు

సత్తిబాబు సమైక్యవాది ఎలాగయ్యాడు

బొత్స సత్యనారాయణకు తెలంగాణకు కాస్తంత అనుకూలం అని పేరుంది. అందుకే తెలంగాణవాదులు సైతం ఆయన్ను అభిమానిస్తుంటారు. పీసీసీ చీఫ్ గా ఆయనకు పట్టం కట్టే సమయంలో ఆయన నియమకానికి ఇదో కారణం. అలాంటి సత్తిబాబు.. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం.. తాను సమైక్యానికి కట్టుబడి ఉన్నానని.. ఆ దేవదేవుడ్ని సైతం అదే కోరుకున్నానని బాంబు పేల్చారు. అంత పెద్దమనిషి మనసు అంత వీజీగా ఎలా మారిపోయిందని చాలామందికి అర్థం కాలేదు. దానికి తోడు రాష్ట్ర విభజన జరిగితే.. సీమాంధ్రలో తాను కానీ.. తన వాడనుకునే చిరంజీవి.. ఎవరో ఒకరు అక్కడ సీఎం కుర్చీలో కూర్చోవచ్చని కలలు కన్నారు. అందుకు తగ్గట్లే సామాజికి సమీకరణాలు కూడా సానుకూలంగా ఉన్నాయి.  దీంతో ఆ దిశగా పావులు కదిపటం కూడా జరిగింది. అలాంటి పెద్దమనిషి నోట వెంట సమైక్యం అన్న మాట ఎలా వచ్చిందన్నది సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది.

ఇంతకీ జరిగిందేమంటే.. సీమాంధ్రనేతలు బొత్సకు తలంటినట్లు సమాచారం. సీమాంధ్రుడువై ఉండి.. విభజనకు గళం విప్పుతావా? విభజన సంగతి తర్వాత.. ఒకవేళ విభజనకు సానుకూలంగా నిలబడితే.. నీ లిక్కర్ సిండికేటు గురించి.. అప్పుడెప్పుడో  పెద్ద ఇష్యూ అయి.. వైఎస్ పుణ్యమా అని బయటపడ్డ.. ఫోక్స్ వ్యాగన్ వ్యవహారంతో పాటు.. మరిన్ని ఇష్యూలు బయటకు వస్తాయన్న మాటలకు కాస్త మొత్తబడినట్లు చెబుతున్నారు. ఒకవేళ రాష్ట్ర విభజన జరిగితే చరిత్రలో ఆ పాపం మూటగట్టుకున్న వారిలో నీ పేరు ఉంటుందంటూ సీమకు చెందిన ఓ నేత ఫైర్ అవ్వటం సత్తిబాబును సంకటంలో పడేసిందని.. దాని ఫలితమే.. సమైక్యరాగం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English