అప్పుడే తెలుగుదేశం పార్టీకి ఆ భయం పోయిందా...!

అప్పుడే తెలుగుదేశం పార్టీకి ఆ భయం పోయిందా...!

ఓటుకు నోటు కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పుడే... వరంగల్ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ఖాయం అయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా కడియం శ్రీహరి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయన రాజీనామాతో వచ్చిన ఈ ఉప ఎన్నికలను ఎదుర్కొనడానికి ఒక్కో పార్టీ ఒక్కోలా సిద్ధం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో మొన్నటి వరకూ ఈ ఎన్నికల విషయంలో ఒక వ్యూహాన్ని అనుసరించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తన వ్యూహాన్ని మారుస్తుండటం విశేషం.

ఓటుకు నోటు కుంభకోణంతో తమకు తెలంగాణ జనాల మధ్య చెడ్డపేరు వచ్చిందని... ప్రస్తుతానికి ఎన్నికలకు కాస్త దూరంగా ఉండటమే మంచిదని మొన్నటి వరకూ తెలుగేదశం లెక్కలేసుకొందట. ఎలాగూ మిత్రపక్షం బీజేపీ ఉండనే ఉంది కాబట్టి... ఆ పార్టీ చేత పోటీ చేయించి తాము మద్దతుగా నిలవాలని తెలుగుదేశం భావిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం తెలుగుదేశం తన వ్యూహాన్ని మార్చుకొన్నట్టు సమాచారం. తాము ఎన్నికల బరిలో నిలుస్తామని భారతీయ జనతా పార్టీ వద్ద ప్రతిపాదిస్తోంది తెలుగుదేశం.  ఈ సీటు తమదని బీజేపీ కన్ఫర్మ్ అయినా... తెలుగుదేశం మాత్రం తామూ పోటీ చేస్తామని పోటీకి వస్తోంది.

దీన్ని బట్టి తెలుగుదేశం పార్టీ కి ఓటుకు నోటు కుంభకోణం భయం పోయిందనే అనుకోవాలి. ఓటుకు నోటును జనాలు మరిచిపోయారు.. ఇక తెలంగాణ ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి తామే బరిలో నిలవాలని తెలుగుదేశం భావిస్తోందని సమాచారం. అయితే బీజేపీ మాత్రం తాము పోటీకి చాలా ఉత్సాహంతో ఉన్నట్టుగా తెలుగుదేశానికి స్పష్టం చేస్తోంది. ఈ సీటు నుంచి సార్వత్రిక ఎన్నికల సమయంలోతామే పోటీ చేశామని.. ఇప్పుడు మళ్లీ తమకే అవకాశం కావాలని కమలనాథులు అంటున్నారు. మరి ప్రస్తుతానికి అయితే ఈ రెండు పార్టీల మధ్య ఈ విధంగా పోటీ ఉంది. ఎవరుబరిలోకి దిగుతారో!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు