కిషన్ రెడ్డి నిజంగానే మీకంత సీను ఉందా..?!

కిషన్ రెడ్డి నిజంగానే మీకంత సీను ఉందా..?!

త్వరలో జరగనున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో గెలిచేస్తామని ప్రకటించాడు భారతీయ జనతా పార్టీ నేత కిషన్ రెడ్డి. పార్టీ తెలంగాణ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్న ఆయన ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ను వ్యక్తం చేయడంలో పెద్ద విశేషం ఏమి లేకపోవచ్చు. అయితే వాస్తవంలో పరిస్తితి ఏమిటనేది ఇక్కడ గమనించాలి. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో పర్వాలేదనిపించుకొనే స్థాయి ఫలితాలు పొందినా...  కేంద్రంలో అధికారాన్నే సొంతం చేసుకొన్నా బీజేపీ లో ఇప్పుడు ఆ ఉత్సాహం కొనసాగడం లేదు.

తెలంగాణలో రాజకీయంగా బలపడటానికి అవకాశం ఉన్నా ఇప్పటి వరకూ భారతీయ జనతా పార్టీ సాధించింద ఏమీ లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి మద్దతు నిచ్చిన.. పార్లమెంటులో తెలంగాణ బిల్లుకు మద్దతు పలికినా.. ఆ విషయాలను బీజేపీ క్యాష్ చేసుకోలేకపోయింది. ఇక ఇప్పుడేమిటయ్యా అంటే బీజేపీ వైపు వచ్చిన కొంతమంది నేతలు కూడా అసంతృప్తితోనే ఉన్నారు.జగ్గారెడ్డి అయితే బీజేపీని వీడి వెళ్లిపోయాడు. బీజేపీ  కేంద్రంలో అధికారంలోకి వచ్చాకా తొలిసారి ఈ పార్టీలోకి వచ్చిన చేరిన వారిలో జగ్గారెడ్డి ఒకరు.

మరి ఇప్పుడు ఆయన కూడా వెళ్లిపోయాడు. ఇక నాగం జనార్ధన్ రెడ్డి కూడా కచ్చితంగా బీజేపీలోనే ఉంటాడంటే నమ్మకం కుదరడం లేదు. ఓవరాల్ గా బీజేపీ పరిస్థితి ఇలా ఉంది. మరిఇలాంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి మాత్రం తాము జీహచ్ ఎంసీలో అధికారాన్ని సొంతం చేసుకొంటాం అంటున్నాడు. ఇది కొంచెం అతివిశ్వాసమేఅవుతోంది. అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని బీజేపీ నేతలు పోరాడి విజయంసాధించగలరా మరి?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు