ఇద్దరు మంత్రులు హ్యాపీ

ఇద్దరు మంత్రులు హ్యాపీ

రాష్ట్రానికి చెందిన ఇద్దరు మంత్రులకు వివిధ కేసుల్లో ఊరట లభించింది. తెలంగాణ ప్రాంతానికి చెందిన జానారెడ్డి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ధర్మాన ప్రసాదరావు వేర్వేరు కేసుల్లో కోర్టు తీర్పు కోసం ఎదురు చూశారు, వారి ఎదురు చూపులు ఫలించాయి. అక్రమంగా ఆస్తులు ఆర్జించారని జానారెడ్డిపై కోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా, ఆ వివాదం జానారెడ్డిని రాజకీయంగా ఇరుకున పడేసింది. కాని కోర్టు ఆ కేసును కొట్టేశాక జానారెడ్డి రిలీఫ్‌ ఫీలయ్యారు.

 ధర్మాన ప్రసాదరావు కేసు, రాష్ట్రాన్ని కుదిపేస్తునే ఉంది. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌కి సంబంధించిన కేసు ఇది. ఇందులో ధర్మానను సిబిఐ నిందితుడిగా చేర్చి చార్జ్‌ షీట్‌ని దాఖలు చేయడం జరిగింది. ధర్మానను విచారించేందుకు ప్రభుత్వ అనుమతి అక్కర్లేదని కింది కోర్టు చెప్పగా, దాన్ని హైకోర్టు కొట్టివేసింది. అంటే ధర్మానకు ఊరట లభించినట్టుగానే చెప్పుకోవాలి. ప్రభుత్వమెలాగూ ధర్మాన ప్రసాదరావుని వెనకేసుకు వస్తున్నది. కేసులు, కోర్టులు, వాయిదాలు, తీర్పులు వీటితోనే రాష్ట్రంలో రాజకీయాలు నిండిపోయాయి. మంత్రి వర్గం కూడా ఈ కేసులతోనే కాలక్షేపం చేస్తున్నట్టుగా ఉంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English