స్పీక‌ర్ పై జ‌గ‌న్ లేఖాస్త్రం : ఇట్లు మీ .. నిత్య అసంతృప్తుడు

స్పీక‌ర్ పై జ‌గ‌న్ లేఖాస్త్రం : ఇట్లు మీ .. నిత్య అసంతృప్తుడు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌లకు వైఎస్సార్ సీపీ అధినేత, జగన్మోహన్ రెడ్డి లేఖాస్త్రం సంధించారు. కుటిల రాజకీయ వ్యూహాలకు అసెంబ్లీని వేదికగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ లేఖ‌లో ప‌లు అంశాల‌పై త‌న అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. కమిటీ ఆన్ జనరల్ పర్పజ‌స్ సమావేశాన్ని ఏ ఉద్దేశంతో నిర్వహిస్తున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఫోటో తొలగింపుపై చర్చించేందుక ఉద్దేశించిన కమిటీలో 25 మంది సభ్యుల్ని నియమించిన స్పీకర్‌, త‌మ పార్టీకి చెందిన ముగ్గురికే చోటు కల్పించారని ఫైర్ అయ్యారు. అంతేకాక తాము ఢిల్లీలో దీక్ష చేస్తున్న రోజే కమిటీ ఆన్ జనరల్ పర్పజ‌స్ సమావేశాన్ని ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు.

వర్షాకాల సమావేశాల్లో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ అరాచ‌కాలు, అవినీతి, అక్ర‌మాల‌పై చర్చ జరగకుండా ఉండేందుకు స్పీక‌ర్ ఓ ప‌థ‌కం ప్ర‌కారం ఈ ఎత్త‌గ‌డ వేశార‌ని జగన్ విమర్శించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాము ప్రస్తావించబోయే 19 ప్రధానాంశాలను కూడా జగన్ తన లేఖలో పేర్కొన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English