పవన్ ని టార్గెట్ చేసిన శ్రీమంతుడు

పవన్ ని టార్గెట్ చేసిన శ్రీమంతుడు

టాలీవుడ్ లో బాహుబలి మేనియా ముగింపు దశకు చేరుకుబోతున్న సందర్బంలో మరో ఫీవర్ మొదలైంది. అదే మహేష్ శ్రీమంతుడు. ఇప్పుడు ఇండస్ట్రీ లో ఎక్కడ చూసిన ఈ సినిమా గురించే చర్చలు నడుస్తున్నాయి. ముఖ్యం ఇందులో వినిపిస్తున్నావి రెండే రెండు. మొదటిది బాహుబలి రికార్డులను శ్రీమంతుడు తెలుగులోనైనా అందుకుంటుందా? దీనికి ఇండస్ట్రీ లో వినిపిస్తున్న టాక్ ఏమిటంటే..బాహుబలి తెలుగు రికార్డులను శ్రీమంతుడు కాదు కదా ఈ తెలుగు ఏ సినిమాకైనా ఇప్పట్లో సాధ్యం కాదనేది వారి వాదన. బాహుబలి లాంటి సినిమాలు ఇండస్ట్రీలలో చాలా అరుదుగా వస్తుంటాయని వారి వాదన.

రెండోది పవన్ అత్తారింటిని అయిన దాటుతుందా? అయితే ఇది మాత్రం శ్రీమంతుడికి అంత కష్టం కాదనేది ఇండస్ట్రీ టాక్. బాహుబలి వచ్చిన తరువాత తెలుగు సినిమా మార్కెట్ ఇంకా పెరిగిందనేది అందరికి తెలిసిన వాస్తవం. ఈ టైమ్ లో మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్ సినిమా రావడం ఆసినిమాకి ఇంకా ప్లస్ అవుతోందని అంటున్నారు. ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం అత్తారింటిని దాటే చాన్స్ లు ఎక్కువ వున్నాయని అంటున్నారు.  మహేష్ అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. తమ హీరో సినిమా బాగా ఆడాలని, కొత్త రికార్డులు నెలకొల్పాలని కోరుకుంటున్నారు. మరి ప్రిన్స్అభిమానుల కోరిక నెరవేరుతుందా? లేదా అన్నది చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు