ఒక్క ఫోన్ కాల్ కే పట్టపగ్గాల్లేవ్..

ఒక్క ఫోన్ కాల్ కే పట్టపగ్గాల్లేవ్..

చేతిలో చిల్లిగవ్వ లేనోడికి వంద రూపాయిల నోటు చిక్కితే వాడి ఆనందానికి అంతే ఉండదు. ప్రపంచంలో తానే అత్యంత అదృష్టవంతుడ్ని అని.. గొప్పవాడినని అనుకుంటాడు. సరిగ్గా అలానే ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేయటాన్ని చాలా గొప్ప విషయంగా ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పుకుంటున్నారు. నిజానికి ఒక  పార్టీకి చెందిన నేత ఫోన్ చేసిన విషయాన్ని నలుగురికి చెప్పి బాకా ఊదుకోరు. కానీ.. విజయమ్మ పరిస్థితి వేరు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తమను గుర్తించిందన్న ఆనందం ఆమె మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పార్టీ నేతలకైతే పట్టపగ్గాల్లేవ్. తమ బలాన్ని గుర్తించటం వల్లే తమకు ఫోన్ చేశారని సంబరపడిపోతున్నారు.

ఇక్కడో విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో కాంగ్రెస్... బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని ఏర్పర్చగల సత్తా మన రాష్ర్టానికే చెందిన చంద్రబాబునాయుడు ఎప్పుడో చేశారు. అది  కూడా ఆయనే జాతీయనాయకులను ఒక వేదికపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఫోన్ చేశారని సంబరపడుతున్న మమతా బెనర్జీ కావచ్చు.. ములాయం కావచ్చు.. సీపీఎం.. సీపీఐ నేతలతో సహా.. వీరూ వారు అన్న తేడా లేకుండా మూడో ఫ్రంట్ ను ఏర్పర్చగల సత్తా బాబు సొంతం. అంటే.. నలుగురిని కూడగట్ట గల నాయకత్వ లక్షణం తెలుగుదేశం పార్టీకి ఉంటే.. ఆ జట్టులో ఒక సభ్యురాలిగా ఉంటారా? అని అడిగినందుకే పండగ చేసుకుంటున్న వైఎస్సార్ పార్టీని అల్పానందాన్ని చూసి జాలి పడాల్సిందే.

జాతీయ రాజకీయాల్లో రాష్ట్ర పార్టీల నేతలు కీలకభూమిక పోషించటం ఇదేమి మొదటిసారి కాదు.  ఎన్టీఆర్ కావచ్చు.. చంద్రబాబునాయుడు కావచ్చు.. వారికి జాతీయ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంది. వారే గ్రూపు నాయకులుగా వ్యవహరించారు. గ్రూపు సభ్యులుగా ఉండలేదు. మరి.. జట్టులోకి వస్తారా అన్నదానికే వైఎస్సార్ కాంగ్రెస్ తెగ సంబరపడిపోయి.. అదేదో ఎచీవ్ మెంట్ మాదిరి మీడియాలో ప్రచారం చేసుకోవటం చూస్తుంటే.. జగన్ ఫాలోయర్లకు ఎలా ఉందో తెలియదు గాని రాజకీయాలను గమనిస్తున్నవాళ్లకు మాత్రం నవ్వొస్తోంది!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు