లాస్ ఏంజల్స్ లో సూపర్ సింగర్స్ హంగామా..

లాస్ ఏంజల్స్ లో సూపర్ సింగర్స్ హంగామా..

లాస్ ఏంజల్స్, May 3rd, 2013. లాటా మరియు ట్రిపుల్ ‘ఏ’ సంస్థల ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ నైట్ లో  సూపర్ సింగర్స్ హంగామా చేసారు. నిర్విరామంగా 4 గంటలు జరిగిన ఈ కార్యక్రమం లో 1400 మంది పైగా స్థానిక తెలుగు వారు పాల్గొన్నారు.

ప్రసిద్ధ గాయకులు రఘు కుంచె, ఉష , సుమంగళి,హేమ చంద్ర, శ్రావణ భార్గవి, అంజనా సౌమ్య మరియు దినకర్ తమ పాటలతో వచ్చిన వారిని అలరించారు. కొత్త మరియు పాత తెలుగు పాటలతో పాటు అద్భుతమైన హిందీ పాటలు కూడా ఆలపించారు. కొత్తగా పెళ్ళైన జంట హేమ చంద్ర, శ్రావణ భార్గవి కలసి పాడిన యుగళ గీతాలకి  ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. హేమ చంద్ర, రఘు కుంచె, దినకర్ ప్రేక్షకుల మధ్యలోకి వెళ్లి పాటలు పడుతూ మరింత ఉత్సాహ పరిచారు. ఇంత ఘనంగా ఈ కార్యక్రమం  జరగడానికి తోడ్పడిన దాతలకు, కార్యకర్తలకు, అలాగే సభ్యులకు లాటా కార్యవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు .

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు