అవినీతిని ఇక్కడా పాతరేస్తే?

అవినీతిని ఇక్కడా పాతరేస్తే?

కర్నాటకలో కాంగ్రెస్‌ గెలవడంతో రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు ఆనందపడుతున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలే ఆంధ్రప్రదేశ్‌లో కూడా పునరావృతమవుతాయని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. కాని కర్నాటక ప్రజలు అక్కడ అధికారంలో ఇప్పటిదాకా ఉన్న బిజెపిని ఇంటిదారి పట్టించారు.

మంత్రులపై అవినీతి ఆరోపణలు రాగా, వాటిని కర్నాటక ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. మన రాష్ట్రంలోనూ మంత్రులది ఇదే పరిస్థితి. ఓ మంత్రి జైల్లో కూర్చోగా, ఇద్దరు మంత్రులకు ఇంకా జైలు గండం పొంచి ఉన్నది. నలుగురు మంత్రులు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుండగా, ఇతర వివాదాలు ఇంకో ఆరుగురు మంత్రులపై ఉన్నవి.

కర్నాటకలో అధికార పార్టీ ఇంటిదారి పట్టింది. ఇవన్నీ బేరీజు వేసుకుంటే కర్నాటక ఫలితాలు ఇక్కడా రిపీట్‌ అవ్వొచ్చు. అది జరిగితే కాంగ్రెస్‌ ఇంటికి వెళ్ళక తప్పదు. అది కాంగ్రెసువారు గుర్తుంచుకోవాలి.