నమ్మించి గెలిచారు

నమ్మించి గెలిచారు

కర్నాటకలో కాంగ్రెసు పార్టీ ఎలా గెలవగలిగింది? అన్న చర్చ దేశమంతటా జరుగుతున్నది. జాతీయ స్థాయిలో కాంగ్రెసు పార్టీ అనేక కుంభకోణాలతో సతమతమవుతున్నదనే విషయాన్ని కన్నడ ఓటర్లు పెద్దగా పరిగణనలోకి తీసుకోలేదు. కారణం ఏమంటే తాము నిలువునా బిజెపి అధికారంలో ఉండగా దోపిడీకి గురయ్యామని వారు ఆవేదన చెందడమే.

ముఖ్యమంత్రులు మారడం, గనుల్ని విచ్చలవిడిగా అధికార పార్టీవారు దోచుకోవడం, వీటికి తోడుగా అసెంబ్లీలో మంత్రులు అశ్లీల చిత్రాలు మొబైల్‌ ద్వారా వీక్షించడం వంటివి బిజెపిని ఓడించాయి అసెంబ్లీ ఎన్నికల్లో. ఇవి డామినేట్‌ చేయడం వల్ల కాంగ్రెసుపై బిజెపి చేసిన ఆరోపణలను ఓటర్లు పరిగణనలోకి తీసుకోలేదు. దూరపు కొండలు నునుపు.

జాతీయ స్థాయి అవినీతి కన్నా తమ రాష్ట్రంలో జరిగిన అవినీతి పెద్దగా ఓటర్లకు కనిపించబట్టి, దాన్ని బూతద్దంలో చూపించడంలో కాంగ్రెసు సఫలమయ్యింది కాబట్టి కాంగ్రెసు గెలిచింది. ఓటర్లను నమ్మించి కాంగ్రెసు గెలిస్తే, ఓటర్లను ఆకట్టుకోలేక బిజెపి విఫలమయ్యిందని చెప్పవచ్చును.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు