భూమాను అంత మాట అనేసి.. లోపలేశారా?

భూమాను అంత మాట అనేసి.. లోపలేశారా?

ఏపీలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. కర్నూలు జిల్లా నంద్యాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన భూమా నాగిరెడ్డిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు వేయటానికి వచ్చిన భూమా కుమార్తె అఖిల ప్రియకు.. పోలీసులకు మధ్య మొదలైన వివాదం పెద్దది కావటమే కాదు.. సీన్లోకి భూమా ఎంటర్ కావటంతో మరింత రచ్చ అయ్యింది.

ఎమ్మెల్సీ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో ఓటేయటానికి పోలింగ్ కేంద్రానికి భూమా కుమార్తె.. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ వచ్చారు. వచ్చిన ఆమె.. వచ్చామా.. ఓటేశామా.. వెళ్లిపోయామా అన్నట్లుగా ఉండకుండా.. మా నాన్న వచ్చే వరకూ పోలింగ్ బూత్ లోనే ఉంటానని చెప్పేశారు. అలాంటిది కుదరదని.. ఓటు వేయటానికి వచ్చిన వారు ఓటేసి వెళ్లిపోవాలే తప్పించి.. ఇలా ఎదురుచూడటాలు కుదరవని పోలీసులు సుతిమొత్తగా చెప్పారు. అయినా వినకపోవటంతో కాస్త గట్టిగానే చెప్పేశారు.

దీంతో.. అఖిల ప్రియ చెలరేగిపోయారు. విషయం టీవీల్లో స్కోలింగ్ లలో రావటం.. అనుచరుల ద్వారా భూమాకు విషయం ఫోన్లో వెళ్లిపోవటంతో సీరియస్ గా సీన్లోకి భూమా వచ్చేశారు. పోలీసులకు.. భూమాకు మధ్య మాట..మాట జరిగింది. ఈ సందర్భంగా భూమా అన్న మాటకు.. ప్రతిగా అక్కడి డీఎస్పీ ఏకవచనంతో నువ్వు అరిస్తే ఏం కాదని అన్నారని.. దీంతో భూమా మరింత గట్టిగా మాట్లాడారని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

ఒక గౌరవ ఎమ్మెల్యేని అలా దూషిష్తారా? ఇదంతా పోలీసుల దురుసుగా వ్యవహరించటంవల్లే విషయం ఇంతవరకు వచ్చిందని జగన్ బ్యాచ్ ఆరోపిస్తున్నారు. నాఇష్టం వచ్చినంత సేపు పోలింగ్ కేంద్రం దగ్గర ఉంటాననంటే పోలీసులు ఒప్పుకోరు కదా. మొత్తానికి ఈ ఎపిసోడ్ లో భూమా దురుసుగా వ్యవహరించటంపై ఆయన్ని అరెస్ట్ చేసి.. స్టేషన్ కి తీసుకెళ్లారు. దీంతో.. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఎమ్మెల్యేలకే రక్షణ లేకుండా పోయిందని మండి పడుతున్నారు. అధికారం చేతిలో లేనప్పుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించకూడదు కదా..?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు