రండి బాబూ రండీ..

రండి బాబూ రండీ..

దాడి వీరభద్రరావుని లాగాలని ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం సఫలం కాలేదని కాంగ్రెసు నేత, మంత్రి గంటా శ్రీనివాసరావు ఆవేదనతో ఉన్నట్టున్నారు. ఆయన రాకపోతేనేం, కొణతాల రామకృష్ణ వస్తారేమో అని గంటా ఆలోచిస్తున్నారంట. టిడిపిలో ఉండేవారు ఒకప్పుడు గంటా శ్రీనివాసరావు ఆ పరిచయాలతో దాడిని, కాంగ్రెసులోకి లాగాలని ప్రయత్నించి విఫలమయ్యారు.

దాడి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెసులో చేరగా దాన్ని నిరసిస్తూ నిరసన గళం వినిపిస్తున్న కొణతాల రామకృష్ణను పార్టీ మారేలా ప్రేరేపించడంలో పావులు కదుపుతున్నారు గంటా శ్రీనివాసరావు. కొణతాల కాంగ్రెసులోకి వస్తే ఆహ్వానిస్తామన్నారాయన. కాంగ్రెసులో మిగతా నేతలెవరికీ ఇంత ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడంలేదు వేరే పార్టీల్లోనివారికి గాలం వేయడంలో.

గంటా ఎందుకు ఇంత ఆసక్తి చూపుతున్నారన్నది ఆశ్చర్యకరం. అధిష్టానంతో మాట్లాడిన తర్వాతే అని గంటా చెబుతున్నప్పటికినీ, దాడితో రహస్య మంతనం గురించి ఆయన అధిష్టానానికి చెప్పారో లేదో వివరణ ఇస్తే బాగుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు