జగన్ హోటల్లో ఎవరిని కలిశారో ఆధారాలున్నాయా?

జగన్ హోటల్లో ఎవరిని కలిశారో ఆధారాలున్నాయా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి బంజారా హిల్స్ లోని హోటల్లో ఎవరిని కలిశారో తెలుసంటూ టీడీపీ నాయకులు అనడంపై వైసీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ మండిపడుతున్నారు. ఇదంతా టీడీపీ ఆడుతున్న కొత్త డ్రామా అని... బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో జగన్ ఎవరినో కలిశారంటూ కొత్త వాదన ముందుకు తెచ్చారని అంటున్నారు. టీడీపీ వద్ద సాక్ష్యాలుంటే హోటల్ భేటీపై ఏం జరిగిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోయినందుకు ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని అన్న బొత్స టీడీపీ తెలంగాణలో ఓట్లను కోట్లతో ఎలా కొనుగోలు చేసిందో, ఎపిలో కూడా అలాగే చేస్తోందని ఆయన ఆరోపించారు. వ్యవస్థ దారి తప్పితే దాన్ని సక్రమంగా పెట్టడం చాలా కష్టమని, ఒక్క ఎమ్మెల్సీ పదవి కోసం ఇలాంటి నీతి మాలిన పదవులు చేయడం సరి కాదనే ఉద్దేశంతో తమ పార్టీ బలంలేని చోట పోటీకి దూరంగా ఉందని ఆయన గుర్తు చేశారు. అధికారులు నీతిమాలిన పనులు చేయడం సరి కాదని ఆయన అన్నారు. వాళ్లు తల దించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన హితవు పలికారు. అధికారం చేతిలో ఉంది కదా అని నాయకులు చెప్పినట్లు అధికారులు వింటే ప్రజాస్వామ్యంలో ఐదోళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయని గుర్తు చేసుకుని, రేపు అధికారం చేతులు మారితే అప్పుడు తల దించుకోవాల్సి వస్తుందని తెలుసుకోవాలని ఆయన అన్నారు. అధికారులు కూడా వ్యవస్థలోనే ఉంటారని, వ్యవస్థ గాడి తప్పితే దాన్ని మళ్లీ గాడిలో పెట్టడం సాధ్యమయ్యే పని కాదని ఆయన అన్నారు. చట్టప్రకారం అధికారులు కార్యక్రమాలు నిర్వహిస్తే తమకు అభ్యంతరం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పని చేయకూడదని ఆయన అన్నారు. సెక్షన్ 8 విషయానికి వస్తే, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పార్లమెంటులో చట్టం అయినప్పుడు అందులో తప్పున్నా, ఒప్పున్నా చట్టం తుచ తప్పకుండా అమలు కావాలనే తాము ముందు నుంచీ చెబుతున్నామని బొత్స చెప్పారు. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని నగరమని, ఏడాది పాటు అన్నింటినీ గాలికి వదిలేసి ఇప్పుడు కేసు వచ్చిందని చెప్పి ఈ సెక్షన్ గురించి మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English