కోవర్టులు లేని పార్టీలున్నాయా?

కోవర్టులు లేని పార్టీలున్నాయా?

రాజకీయాల్లో కోవర్టులన్న పదానికి ప్రాముఖ్యత పెరిగింది. కొత్త రాజకీయ పార్టీలకు ఈ కోవర్టుల బెడద ఎక్కువగా ఉంటుంది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కూడా దీనికి మినహాయింపు కాదని ఆ పార్టీ మహిళా నేత ఒకరు చెప్పారు.

2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచిన శోభానాగిరెడ్డి, ఇప్పుడు వైఎస్‌ఆర్‌ కాంగ్రెసులో కీలక నేతగా కొనసాగుతున్నారు. ఆమె కోవర్టుల గురించి మాట్లాడుతూ ఐదు నుంచి పది శాతం మంది కోవర్టులు ఉండవచ్చునని అంచనా వేశారు. తెలుగుదేశం పార్టీలో లేరా కోవర్టులు? అని ప్రశ్నించారామె. ఏమో, మా పార్టీలో ఉంటే ఉండవచ్చునని అనడం వరకూ సబబే కాని, వేరే పార్టీలో ఉన్నారు అని చెప్పడం కొన్ని అనుమానాలకు తావు ఇచ్చేలా ఉంటుంది. టిడిపిలో ఉన్న ఆ కోవర్టులు వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ కోసం పనిచేస్తున్నారేమో అనే అనుమానం శోభానాగిరెడ్డి మాటల వల్ల కలుగుతున్నది.

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ 'జనరలైజ్‌' చేశారని మాత్రమే ఇక్కడ అర్థం తీసుకోవాల్సి ఉంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు