బంజారాహిల్స్ సితారలో జ‌గ‌న్ ఎవ‌రిని క‌లిశారు?

బంజారాహిల్స్ సితారలో జ‌గ‌న్ ఎవ‌రిని క‌లిశారు?

ఓటుకు నోటు కేసు మ‌రిన్ని మ‌లుపులు తిరుగుతుందా? టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి అడ్డంగా బుక్ అయిన‌ట్లు మొద‌ట క‌నిపించిన‌ప్ప‌టికీ.. రోజులు గ‌డిచేస‌రికి.. ఈ వ్య‌వ‌హారం చిత్ర‌విచిత్ర‌మైన మ‌లుపులు తిరుగులూ.. క్రైం థిల్ల‌ర్‌ని త‌ల‌పించేలా మారుతోంది. తాజాగా తెలుగుదేశం నేత పంచ‌మ‌ర్తి అనురాధ మాట్లాడుతూ స‌రికొత్త విష‌యాన్ని తెర‌పైకి తీసుకొచ్చారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబ‌రు 12లోని సితార హోట‌ల్‌లో మే 21న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎవ‌రిని క‌లిశార‌న్న‌ది తాము త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామంటూ.. మ‌రింత ఆస‌క్తిని పెంచారు.

ఓటుకు నోటు కేసు మొత్తం ఒక రాజ‌కీయ కుట్ర‌గా టీడీపీ మొద‌టి నుంచి వాదిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ దిశ‌గా త‌మ వాద‌న నిజ‌మని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్ల‌గా చెబుతున్న టీడీపీ నేత‌లు తాజాగా సితార హోట‌ల్‌ను తెర‌పైకి తీసుకొచ్చారు. అంతేకాదు.. వైఎస్సార్ కాంగ్రెస్‌కు అధ్య‌క్షుడిగా జ‌గ‌న్ క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. షాడో అధ్య‌క్షుడు మాత్రం కేసీఆర్ అంటూ తెలుగు త‌మ్ముళ్లు దుయ్య‌బ‌డుతున్నారు. ఇంత‌కీ సితార హోట‌ల్ ఎపిసోడ్‌కు సంబంధించి వీడియోను విడుద‌ల చేస్తారా?ఫోటోలు బ‌య‌ట‌కు వ‌స్తాయా? ఇంత‌కీ ఆ స‌మావేశంలో ఎవ‌రెవ‌రు క‌లిశారు? అన్న విష‌యాలు ఇప్పుడు విప‌రీత‌మైన ఆస‌క్తిని.. మ‌రింత ఉత్కంఠ‌ను గురి చేస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు