దేశాన్ని అథోగతి పట్టించిన ఆ ముగ్గురు

దేశాన్ని అథోగతి పట్టించిన ఆ ముగ్గురు

ఆర్థికంగా దేశాన్ని అథోగతిని పట్టించిన ఆ ముగ్గురు ఎవరు? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. స్వయాన ఆర్థికవేత్తే ప్రధానమంత్రి అయితే.. భారత ఆర్థిక వ్యవస్థ ఎంతో బలోపేతం అవుతుందని అందరూ ఆశిస్తే.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి విలువ రోజురోజుకీ పడిపోతోంది. విదేశీ పెట్టుబడులు మందగించటం.. షేర్ మార్కెట్ కుప్పకూలటం.. బంగారం.. క్రూడ్ అయిల్ బిల్లులు నానాటికీ అధికమవుతూ విలువైన విదేశీ మారక ద్రవ్యం ఇట్టే ఖర్చయిపోతోంది. మరి.. దేశాన్ని ఏలే ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ ఏం చేస్తున్నట్లు? అన్న ప్రశ్న ఉదయించకమానదు.

అదే సమయంలో దేశాన్ని ఆర్థికంగా భ్రష్ఠు పట్టించినోళ్లు ముగ్గురే అంటున్నారు సీపీఐ జాతీయ నేత దాస్ దాస్ గుప్తా. మాటలు తూటాల మాదిరి మాట్లాడే ఆయన ఎవరిపైన అయినా ఇట్టే విరుచుకుపడతారు. పాయింట్ టు పాయింట్ అన్నట్లు రూల్స్ మాట్లాడి మరీ కడిగిపారేస్తారు. మనిషి చాలా సింఫుల్ గా కనిపించే ఆయనకు మరో కోణం ఉంది. అదేమంటే.. నిజాయితీ పరుడు. నేటి రాజకీయ నాయకులకు పూర్తి భిన్నంగా ఉండే ఆయన మాటకు ఉండే బలమే వేరు.  అలాంటాయనకు కేంద్ర నాయకత్వం మీద వీరావేశం తన్నుకొచ్చింది. దేశానికి ఏలే ముగ్గురు కీలక నేతలైన ప్రధాని మన్మోహన్ సింగ్, ఆర్థికమంత్రి చిదంబరం, కేంద్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ అహ్లువాలియా త్రయం దేశాన్ని,ఆర్థికంగా అథోగతి పాలుచేస్తున్నారన్నది దాస్ దాస్ గుప్తా ఆరోపణ. రిలయన్స్ సంస్థకు అమ్ముడుపోయిన కేంద్రం... గ్యాస్ ధరలు పెంచొద్దని ఇంధన మంత్రలు నెత్తీనోరు కొట్టుకున్నాఏకపక్షంగా పెంచేసిందని ఆయన వాపోయారు. మరోవైపు పేదలకు ఆహారభద్రత పథాకాన్ని కూడా కేంద్రం పార్లమెంటులో చర్చించకుండా క్యాబినెట్ నిర్ణయం తీసుకొని.. ఆమోదం కోసం రాష్ర్టపతి వైపు చూడటం కోసం తప్పించుకునే ప్రయత్నమే తప్ప మరోకటి కాదు.

సమర్థమైన నాయకత్వ లోపం ఈ దేశాన్ని దశాబ్దాలుగా పట్టిపీడిస్తింది. నౌకను నడిపే కెప్టెన్ సరిగా ఉంటే.. ఈ బాధలేమీ ఉండేవి కావు కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు