జేసీ బ్రదర్ ఇరికిస్తున్నాడా? సేవ్ చేస్తున్నాడా?

జేసీ బ్రదర్ ఇరికిస్తున్నాడా? సేవ్ చేస్తున్నాడా?

వెనుకా ముందు చూసుకోకుండా మనసులో ఉన్న మాటల్ని కాస్తంత బోల్డ్ గా మాట్లాడటం సీమాంద్రకు చెందిన జేసీ బ్రదర్స్ కు అలవాటే. జేసీ దివాకర్ రెడ్డి కంటే ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కాస్తంత ఆవేశం ఎక్కువ. జేసీ దివాకర్ రెడ్డి ఏదైనా మాట్లాడితే కాస్తంతో లోతుపాతులు కనిపిస్తాయి. కానీ.. దివాకర్ రెడ్డి విషయంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. మీడియా కెమేరాల ముందు కూడా దడవని నేతలు ఎవరైనా ఉన్నారంటే.. వారిలో ప్రభాకర్ రెడ్డి ముందువరుసలో ఉంటాడు. అలాంటి ఆయన ఓటుకు నోటు వ్యవహారంలో కసబిసా అంటూ వ్యాఖ్యలు చేసేశారు.

ఓటుకు నోటు వ్యవహారంలో బయటకు వచ్చి సంచలనం రేపుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆడియో సీడిపై ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ఈ వ్యవహారంపై ఇంతవరకూ సూటిగా మాట్లాడిన తెలుగు తమ్ముళ్లు లేరనే చెప్పాలి. కానీ.. అందుకు భిన్నంగా జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడేశారు. ప్రస్తుతం తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. టేపులో చంద్రబాబు డబ్బు గురించి వ్యాఖ్యాలించలేదని తేల్చేశారు.

చంద్రబాబువిగా చెబుతున్న ఆడియోలో ఎక్కడా డబ్బులిస్తామని చెప్పలేదని.. ధైర్యం..భరోసా ఇవ్వటం చంద్రబాబుకు అలవాటేనని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు చంద్రబాబు ఆడియోను ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించిన ఆయన.. టీడీపీ ఎమ్మెల్యేకు తన క్యాబినెట్ లో మంత్రి పదవి ఇచ్చినప్పుడు రాజకీయ విలువలు గుర్తుకు రాలేదా? అంటూ కేసీఆర్ విమర్శించారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చంద్రబాబును సేవ్ చేసేవా..? మరికాస్త ఇరుకున పెట్టేవా అన్న మీమాంసలో మరింత టెన్షన్ పడిపోతున్నారు తెలుగుతమ్ముళ్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు