చల్లారిన బయ్యారం గొడవ

చల్లారిన బయ్యారం గొడవ

బయ్యారం గొడవ కొంతవరకు సద్దుమణిగింది. కాని తెలంగాణ రాష్ట్ర సమితి బయ్యారం అంశాన్ని అజెండగా పెట్టుకుని తెలంగాణ ఉద్యమ సత్తా చాటాలనే ఆలోచనతో ఉన్నది. 'భూకంపం సృష్టిస్తావా? అడ్డుకునే సత్తా నాకుంది' అని సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అనడాన్ని సీరియస్‌గా తీసుకుని, తాను భూకంపం సృష్టిస్తే ఎలా ఉంటుందో కిరణ్‌రెడ్డికి రుచి చూపించాలనుకుంటున్నారు టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసియార్‌.

ఖమ్మం జిల్లాలో టిఆర్‌ఎస్‌కి పట్టు చాలా తక్కువ. బయ్యారం పేరుతో ఉద్యమ నినాదం వినిపిస్తే ఖమ్మం జిల్లాలో పాగా వేయచ్చునని ఆయన ఆలోచన చేశారు. కాని కెసియార్‌ దాన్ని ఎంత ఉధృతంగా వినిపించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ వారం రోజుల క్రితం ఉన్న వేడి ఇప్పుడు కనిపించడంలేదు. కెసియార్‌ ఎలా భూకంపం సృష్టిస్తారోగాని బయ్యారం వేడి చల్లారేసరికి అధికార పార్టీలో ఎవరూ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదని చెప్పవచ్చును. కాని కెసియార్‌ని అంత తేలిగ్గా తీసుకోడానికి లేదు. రాత్రికి రాత్రి ఉద్యమ సెగ రగిలించడంలో ఆయన దిట్ట కదా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు