ఆ ఆడియో టేపులేం పనికిరావు....

ఆ ఆడియో టేపులేం పనికిరావు....

నోటుకు ఓటు కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతోంది. ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్లుగా ఉన్న ఆడియో టేపులు విడుదల అయ్యాయి. ఈ మేరకు వివిధ చానల్లలో ఆ టేపులు ప్రసారం కావడం రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ టేపులతో టీడీపీ వర్గాలు ఒకింత కలవరపాటుకు గురయ్యాయి. చంద్రబాబు, టీడీపీ ప్రత్యర్థులు ఖుష్ అయ్యారు. అయితే...నిజంగా ఆ టేపుల్లో అంత పస ఉందా అంటే..అదేమీ లేదనే దిశగానే వార్తలు వస్తున్నాయి.

ఆ టేపుల ప్రకారం..బాబు స్టీఫెన్ సన్ తో తన వాళ్లు అంతా చెప్పారని, అన్నింటికీ తాను అండగా ఉంటానని, స్వేచ్ఛగా ఓటువేయాలని మాత్రమే చెప్పారు. అయితే చంద్రబాబు మాట్లాడినట్లుగా చెప్తున్నదాని ప్రకారం ఎక్కడ కూడా స్టీఫెన్ సన్ ను తమకు ఓటు వేయాలని బాబు కోరలేదు. దీంతో పాటు తమకు ఓటువేస్తే...డబ్బులు లేదా ఇంకోటో ముట్టచెప్తానని కూడా హామీ ఇవ్వలేదు. పైగా ఆ టేపులు ఎప్పటివీ అనేది కూడా ఈ టేపుల్లో పేర్కొనలేదు. ఒకవేళ ఎన్నికల సమయం నాటివి కాకుండా ఉంటే... వాటికి విశ్వసనీయత ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.

వీటన్నింటికీ తోడు ఉమ్మడి రాజధానిలో ఉన్నపుడు సీఎం స్థాయి వ్యక్తి ఫోన్ ట్యాప్ చేయడం అనేది మొదటి అడ్డంకిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నైతికం అనే విషయాన్ని పక్కనపెడితే...టెక్నికల్ గా ఈ టేపులు నిలబడే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఓటుకు నోటు కేసు విషయంలో చంద్రబాబు నాయుడుకు వచ్చిన తక్షణ ఇబ్బందేమీ లేదని పేర్కొంటున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు