అపుడే వెనకేసుకస్తున్న బొత్స

అపుడే వెనకేసుకస్తున్న బొత్స

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకే వైసీపీలో చేరానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు బొత్స సత్యనారాయణ చెప్పిన సంగతి తెలిసిందే. పార్టీలో చేరిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ ను ఎంతో వెనకేసుకు వచ్చారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్ లో జరిగిన నిర్ణయాలన్నింటికీ అప్పటి మంత్రివర్గం సమష్టి బాధ్యత ఉంటుందని అన్నారు. అయితే సదరు నిర్ణయాల ఆధారంగా జరిగిన వాటికి తమకు సంబందం లేదని తాను అప్పుడు చెప్పానని, ఇప్పుడు కూడా చెబుతున్నానని అన్నారు. అయితే ఆ అవినీతితో జగన్ కు సంబంధం ఉందని తాను ఎప్పుడూ అనలేదని బొత్స అన్నారు.

జగన్ అవినీతి సంగతి ఏంటని ప్రశ్నించగా...ఆ విషయం కోర్టులలో ఉందని, తాను మాట్లాడటం బాగోదని బొత్స అన్నారు. మీడియా అబిప్రాయాలు తనపై రుద్దవద్దని ఆయన అన్నారు. తన చేరికతో పార్టీలో ఎవరు అసంతృప్తిగా ఉన్నది తనకు తెలియనది, ఆ వివరాలు తెలిస్తే వారితోనే మాట్లాడండని బొత్స అన్నారు. విజయనగరం జిల్లాలో పార్టీ నేతలందరిని కలుపుకుని వెళతానని ఆయన చెప్పారు. విభజన సమయంలో తాము ఏపీ ప్రయోజనాలను రక్షించడానికి పోలవరం తదితర ప్రాజెక్టులను సాధించామని ఆయన అన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇవ్వడాన్ని బొత్స సమర్ధించారు. వైసీపీ రెండు రాష్ర్టాల్లోనూ ఉన్న పార్టీ అని, ఆ పొత్తు తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజలకు మేలు చేయడానికి ఉపయోగపడుతుందని అన్నారు. గతంలో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ ఎందుకు జత కట్టిందని ఆయన ప్రశ్నించారు. 2009 లో టీడీపీ, టీఆర్ఎస్ లు పొత్తుపెట్టుకున్న విషయాన్ని మర్చిపోయారా అని ఆయన అన్నారు. ఒక దశలో బీజేపీ సైతం ఎన్డీఏ సమావేశానికి కేసీఆర్ ను ఆహ్వానించిందని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై విపక్ష కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలతో కలిసి పోరాడవచ్చని అన్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు