ఒకే స‌మ‌యంలో.. ఆ ముగ్గురూ ఢిల్లీకి..?

ఒకే స‌మ‌యంలో.. ఆ ముగ్గురూ ఢిల్లీకి..?

ఒక‌ట్రెండు రోజులు తేడాతో ముగ్గురు ముఖ్య‌నేత‌లు ఢిల్లీకి వెళ్ల‌టం ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ తో పాటు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు సైతం ఢిల్లీకి వెళ్ల‌టం ఇప్పుడు ప‌లు వాద‌నల‌కు తావిస్తోంది.

ఆప‌రేష‌న్ రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం.. నేప‌థ్యంలోనూ వీరంతా ఢిల్లీకి ప‌య‌న‌మ‌వుతున్నార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. పైకి చూసిన‌ప్పుడు వేర్పురు కార్య‌క్ర‌మాల కోసం దేశ రాజ‌ధానికి ప‌య‌న‌మ‌వుతున్న‌ట్లు క‌నిపిస్తున్న‌ప్ప‌టికీ.. ముగ్గురూ కాస్త తేడాతో ఢిల్లీలో ఉండ‌టం మాత్రం ప‌లు సందేహాల‌కు కార‌ణ‌మ‌వుతోంది.
ఈ నెల తొమ్మిదిన గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్‌.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఇద్ద‌రూ ఢిల్లీకి వెళ్ల‌నున్నారు. వారు వేర్వేరుగా వివిధ కేంద్ర మంత్రుల‌తో భేటీ కానున్నారు. ఆ ప‌క్క రోజు అంటే జూన్ 10న కూడా బాబు ఢిల్లీలోనే ఉండ‌నున్నారు. ఆయ‌న ఆ రోజు చైనాప్ర‌తినిధుల‌తో స‌మావేశం కానున్నారు. ఇక‌.. జూన్ 11, 12 తేదీల్లో న‌ర‌సింహ‌న్ ఢిల్లీలో ఉంటున్న ప‌రిస్థితి.

అయితే.. జూన్ 12న ఢిల్లీకి తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఢిల్లీకి ప‌య‌నం కానున్నారు. ఆయ‌న ఢిల్లీకి వెళ్లే స‌మ‌యానికి గ‌వ‌ర్న‌ర్ హ‌స్తిన‌లో ఉండ‌టం గ‌మ‌నార్హం. రేవంత్ వ్య‌వ‌హారంపై సెట్ చేసేందుకే.. ఈ ఢిల్లీ కార్య‌క్ర‌మంగా చెబుతున్నారు. రేవంత్ వ్య‌వ‌హారం పార్టీల స్థాయిని దాటిపోతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో.. దాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకే ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌గా చెబుతున్నారు. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన కీల‌క నేత‌లు ఒకే స‌మ‌యంలో ఢిల్లీలో ఉండటం చిన్న విష‌య‌మేం కాదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు