పవన్ కు తెలిసే పోట్లాటా..?

పవన్ కు తెలిసే పోట్లాటా..?

మిత్రుడో శత్రువో తెలియకుండా ఏపీ రాజధాని వ్యవహారాన్ని వెంటాడుతున్న జనసేన వ్యవస్థాపకుడు, ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ తాజాగా అమరావతి భూమిపూజ సందర్భంగా ఏమైనా మాట్లాడుతారా అని అంతా ఆసక్తిగా చూశారు. అయితే... ఆయన ఏమీ మాట్లాడలేదు కానీ ఆ పార్టీ కార్యకర్లలు మాత్రం పోట్లాటకు దిగారు. జనసేన కార్యకర్తలు చాలా రోజుల తర్వాత మళ్లీ స్పందించారు. విజయవాడలో జనసేన కార్యకర్తలు కొందరు నిరసన ప్రదర్శన చేశారట. ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం పై వారు ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును నమ్మి మోసపోయామని వారు వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బిజెపి,టిడిపి మంత్రులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. హోదా రాకపోతే ఎపికి తీవ్ర అన్యాయం జరుగుతుందని వారు వ్యాఖ్యానించారు.

భూమి పూజ సందర్భంగా రాజధాని ప్రాంతం పరిసర పట్టనణాలన్నీ రాజకీయంగా మంచి హడావుడిగా ఉన్న సమయంలో వారు తమ నిరసన చేపట్టడంతో అందరి దృష్టీ వారిపై పడింది. ఇదంతా పవన్ కళ్యాణ్ స్పూర్తితోనే చేస్తున్నామని వారు అంటున్నారు. మరి పవన్ కు చెప్పి చేశారో.. చేయకుండా చేశారో ఎవరూ చెప్పలేకపోతున్నారు. పవన్ కూడా దీనిపై ఇంతవరకు పెదవి విప్పలేదు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు