రేవంత్ కేసు: ఢిల్లీ ఎఫెక్టు

 రేవంత్ కేసు: ఢిల్లీ ఎఫెక్టు

ఓటుకు నోటు కేసు వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఓటు వేయాలంటూ డబ్బులు ముట్టచెపుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి దొరికిపోయిన విషయం, ఆయన ప్రస్తుతం ఏసీబీ విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈ కేసులు ఏపీ సీఎం చంద్రబాబు పాత్ర ఉందంటూ వార్తలు వస్తున్నాయి. తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఈ మేరకు వ్యాఖ్యానించారు కూడా.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషయం తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిచింది. రేవంత్ రెడ్డి కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కావాలంటూ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ), కేంద్ర హోం శాఖ తెలుగు రాష్ర్టాల గవర్నర్ నరసింహన్ ను నివేదిక కోరినట్లు తెలిసింది. దీంతో ఈ విషయాన్ని గవర్నర్ రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు, సీఎస్ కు సదరు వివరాలు కావాలంటూ పురమాయించినట్లు సమాచారం.

ఈ పరిణామాలన్ని జరుగుతాయని గ్రహించే తెలంగాణ సీఎం గవర్నర్ ను కలిసినట్లుగా కూడా పలువురు అభిప్రాయ పడుతున్నారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు