టీఆర్ఎస్ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్?!

టీఆర్ఎస్ లోకి కోమటిరెడ్డి బ్రదర్స్?!

రాష్ర్ట కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రముఖ నేతగా పేరున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమయినట్లుంది. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ..జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్లు చెప్పినప్పటికీ..అసలు మతలబు వేరే ఉందని తెలుస్తోంది.

త్వరలో స్థానిక సంస్థలో కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు రాబోతున్నాయి. నల్లగొండ జిల్లాకు ప్రస్తుత స్థానంతో పాటు మరో స్థానం జతకూడనుంది. మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఈ ఎన్నికల్లో బరిలోకి దిగాలని చూస్తున్నప్పటికీ కాంగ్రెస్ కు సరిపడా సభ్యులు లేకపోవడంతో గెలుపుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి బ్రదర్స్ కు పొసగడం లేదు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీగా బరిలో దిగే అవకాశం ఇస్తే పార్టీ మారుతారని గతంలోనే చర్చ జరిగింది. మరోవైపు తెలంగాణలో ఉన్న కోమటిరెడ్డి వ్యాపారాలు కూడా..టీఆర్ఎస్ సర్కారు వచ్చిన తర్వాత మందగించాయి. ఈ నేపథ్యంలో ఆ విషయాలు చర్చించుకునేందుకు సీఎంతో సమావేశం అయినట్లు తెలుస్తోంది.

అయితే..గతంలో కూడా పలుమార్లు కోమటిరెడ్డి సీఎంను వ్యక్తిగతంగా కలిసిరావడం, మంత్రి హరీశ్ రావుతో ఒకే కారులో ప్రయాణించడం..తర్వాత కాంగ్రెస్ వాదిగా ఉన్న విషయం తెలిసిందే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు