కేటీఆర్ డీల్ మామూలుగా లేదు...

కేటీఆర్ డీల్ మామూలుగా లేదు...

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, ఆ రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ స‌ర్కారులో రాకింగ్ స్టార్ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. ఏడాది పాల‌న పూర్తి చేసుకున్న త‌ర్వాత...ప్ర‌భుత్వం త‌ర‌ఫున మీడియాతో ముఖ్య‌మంత్రి మాట్లాడ‌క‌పోగా..అన్ని ఛాన‌ల్ల‌లోనూ ఆఖ‌రికి ప్ర‌భుత్వ రేడియో అయిన ఆలిండియా రేడియోలో కూడా కేటీఆర్ ప్ర‌సంగించారు.

సొంత రాష్ర్టంలో ఎంత స‌మ‌యం ఉంటున్నారో..విదేశాల్లో కూడా అంతే స‌మ‌యం గ‌డుపుతున్న కేటీఆర్ అమెరికా టూర్‌లో గూగుల్ వంటి సంస్థ‌లు అతిపెద్ద క్యాంప‌స్ నె తెలంగాణ‌లో ఏర్పాటు చేసేలా విజ‌యం సాధించారు. తాజాగా తైవాన్ లో ప‌ర్య‌టిస్తున్న మంత్రి కేటీఆర్ ...మ‌రో రాకింగ్ డీల్ సెట్ చేసుకువ‌చ్చారు.

ఇంట‌ర్నెట్ వాడ‌కందారుల‌కు సుప‌రిచితం అయిన డీ లింక్ కంపెనీ- తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం మ‌ధ్య ఎంవోయూ (అవగాహనా ఒప్పందం) కుదుర్చుకునేలా సెట్ చేశారు కేటీఆర్‌. ఈ డీల్ విలు రూ.350 కోట్లు. సుమారు 1000 మందికి డైరెక్టు ఎంప్లాయిమెంట్ దొర‌క‌నుంది. దీంతోపాటు తెలంగాణలో గ్లోబల్ ఆర్ అండ్ డీ సెంటర్ ను, నెట్‌వర్క్ ట్రెయినింగ్ సెంటర్‌ను ప్రారంబింప‌చేసేలా డీ లింక్ ఇండియాతో ఒప్పందం కుద‌ర్చుకున్నారు. మొత్తంగా తండ్రికి త‌గ్గ త‌న‌యుడుగా పేరు సంపాదించుకుంటున్నారు కేటీఆర్.

 

TAGS

KTR D Link

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు