ప్లిప్ కార్ట్...భారీ మోసం

ప్లిప్ కార్ట్...భారీ మోసం

టెక్నాలజీ మ‌యం అయిపోయిన ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆన్‌లైన్ మార్కెట్ జోరందుకుంటోంది. ఇందులో భారత్ లో అత్యంత ఆదరణ ఉన్న

ఆన్ లైన్ రిటైల్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ఘ‌న‌త సాధించింది. అయితే వినియోగ‌దారుల‌ విష‌యంలో శ్ర‌ద్ధ చూపించ‌కుండా...ఫేక్ డిస్కౌంట్ లు పెడుతున్నఘటన తాజాగా  వెలుగు చూసింది.

ఓ కంపెనీకి చెందిన మహిళల చెప్పుల జత అసలు ధర రూ. 799 అని, దానిని తాము రూ. 399కే  ఇస్తున్నామంటూ తమ సైట్ లో ప్లిప్ కార్ట్ డీల్ పోస్ట్ చేసింది. దాదాపు సగం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్లిప్‌కార్ట్‌ ప్రకటించింది.  దీంతో ముచ్చ‌ట‌ప‌డి కొనుగోలు చేద్దామని కోల్ కతా కు చెందిన మణి శంకర్ సేన్ భావించారు. అయితే అక్క‌డే ట్విస్టు గ‌మ‌నించి షాక్ తిన్నారు.

ఆ చెప్పులపై ఉన్న అస‌లు ఎమ్మార్పీ ధర అక్షరాలా రూ.399. ఆ రేటును మార్చి ఫ్లిప్ కార్ట్ తమ వెబ్ సైట్ లో పెట్టింది. దీనిపై మండిపడిన మణి శంకర్ సేన్ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో తన స్పందనను తెలియజేశాడు. తొలుత ఏదైనా ప్రొడక్ట్ ఆన్ లైన్ లో పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో పరిశీలించుకుంటే మంచిదని సూచించాడు. ఈ తరహా ఘటనలు వెలుగు చూస్తే ప్రజల్లో విశ్వాసం కోల్పోతారని హెచ్చ‌రించాడు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేసింది. దీంతో అతనికి ఫ్లిప్ కార్ట్ క్షమాపణలు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి పునారావృతం కాకుండా చూసుకుంటామని సంస్థ‌ హామీ ఇచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు