తగ్గేది లేదంటున్న చంద్ర‌బాబు

తగ్గేది లేదంటున్న చంద్ర‌బాబు

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ అభ్య‌ర్థికి ఓటువేయాల‌ని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఏపీ సీఎం, తెలుగుదేశం అధినేత ఇరికించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. మొద‌ట్లో ఈ విష‌యంలో గుంభ‌నంగా ఉన్న చంద్ర‌బాబు త‌న వైఖ‌రిని మెల్లిమెల్లిగా స్ప‌ష్టం చేస్తున్నారు. తాను ఏ త‌ప్పు చేయ‌లేద‌ని, ఏ విష‌యంలోనూ నిప్పులాగా బ్ర‌తికాను కాబ‌ట్టి తాటాకు చ‌ప్పుల్ల‌కు వెన‌క్కిపోన‌ని తెలిపారు.

అయితే తెలంగాన హోంమంత్రి నాయిని న‌ర్సింహారెడ్డి మాత్రం బాబు సైతం కేసులు ఇరుక్కుపోయే అవ‌కాశాలున్నాయ‌ని వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజాగా మ‌రోమారు స్పందించారు. ప్రకాశం జిల్లా సీఎస్ పురం మండలం శీలంవారిపల్లిలో జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు ఘాటుగా స్పందించారు. కేసులు పెడతామంటూ కొంతమంది బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అయినా భయపడేది లేదని చంద్రబాబు స్ప‌ష్టం చేశారు. రేవంత్ రెడ్డి,  ఏసీబీ కేస‌కుల విష‌యం ప్ర‌స్తావించ‌కున్నా ప‌రోక్షంగా బాబు త‌ను అనుకుంటున్న‌దేంటో చెప్పేశారు. దీంతో పాటు తాను ఎట్టిప‌రిస్థితుల్లోనూ వెర‌వ‌డం లేదంటూ ప్ర‌క‌టించారు.

మొత్తంగా రేవంత్ కేసు వ‌ల్ల నిద్ర‌ప‌ట్ట‌డం లేద‌న్న బాబు... బ్లాక్ మెయిల్‌కు భ‌య‌ప‌డ‌బోన‌ని చెప్ప‌డం ఆస‌క్తిక‌ర‌మైన మార్పేన‌ని అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు