బంగారు తాపీతో భూమిపూజ

బంగారు తాపీతో భూమిపూజ

తుళ్లూరు మండలం మందడం గ్రామంలో శనివారం నిర్వహించనున్న ఏపీ రాజధాని భూమి పూజకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సతీసమేతంగా హాజరు కానున్నారు. గ్రామంలోని సర్వే నంబర్ 135, 136 భూమిలో చంద్రబాబు దంపతులు భూమిపూజ చేయనున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భూమిపూజ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు చంద్రబాబు సతీసమేతంగా భూమిపూజ వేదిక వద్దకు చేరుకుంటారు. భూమిపూజలో బంగారు తాపీని వినియోగిస్తున్నారు.

శనివారం ఉదయం 8.49గంటలకు భూమిపూజ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి తెదేపా మంత్రులు, ఎమ్మెల్సీలు, పలువురు అధికారులు హాజరుకానున్నారు. రాజధాని భూమిపూజకు వాడే తాపీ, గమేలాను వెండి, బంగారంతో చేయించడం విశేషం. ఇందుకోసం అందలకూరుకు చెందిన వెంకటరామయ్య అనే వ్యక్తి కిలో వెండితో తాపీ, గమాలను తయారు చేసి, బంగారుపూత పూయించారు. అలాగే భూమిపూజలో నవరత్నాలు వాడనున్నారు. నవరత్నాలను తుళ్లూరు ఎమ్మార్వో సుధీర్‌బాబు తెనాలి నుంచి కొనుగోలు చేశారు.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు