బాబు మానసికంగా సిద్ధమవుతున్నారు​

బాబు మానసికంగా సిద్ధమవుతున్నారు​

తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పై ఆసక్తి తగ్గించుకుంటున్నారా? నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడి ఏడాది దాటుతున్నా ఇంకా సొంత రాష్ర్టంపై ప్రేమ పుట్టడంలేదనే విమర్శలకు బాబు జవాబు ఇవ్వనున్నారా? అంటే అవుననే దిశగానే బాబు అడుగులు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలోనూ పార్టీని బలోపేతం చేయాలనే కారణంతో బాబు హైదరాబాద్ వేదికగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఏపీలో కూడా తాత్కాలిక రాజధాని ఏర్పాటుకు తగిన పరిస్థితులు లేకపోవడం ఒక కారణంగా భావించవచ్చు. ఈనేపథ్యంలో బాబు భాగ్యనగరంలో ఉండక తప్పట్లేదు.

అయితే ఏడాది దాటిపోతున్నప్పటికీ నవ్యాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే వాదనను బాబు పరిగణనలోకి తీసుకున్నారు. దీనికి పరిష్కారంగా..విజయవాడలో  క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇరిగేషన్‌ క్యాంపు ఆఫీస్‌ను సీఎం క్యాంపు ఆఫీస్‌గా మార్చారు. దీంతో బాబు క్యాంప్ ఆఫీసు సిద్ధం అయిపోయింది. శనివారం ఉదయం రాజధాని భూమి పూజ అనంతరం విజయవాడలో క్యాంపు ఆఫీస్‌ను సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. తద్వారా విజయవాడలో ఎక్కువ సమయం ఉండేందుకు అవకాశం దొరకనుంది.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు