అత‌ని కాల్ డేటాను చెక్ చేయ‌రా?

అత‌ని కాల్ డేటాను చెక్ చేయ‌రా?

ఇప్పుడు పిఫ్టీ ఇస్తున్నా.. మిగిలిన 4.5 రేపిస్తా అని రేవంత్ రెడ్డి అంటే.. 4.5.. ఈజ్ వాట్ అంటూ అమాయ‌కంగా ప్ర‌శ్న అడిగిన‌ప్పుడే ఫైర్‌బ్రాండ్ రేవంత్‌కు సందేహం రావాల్సింది. అయితే.. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తూ.. బాగా ఫ్రెండ్లీగా ఉండే రేవంత్ రెడ్డి.. అధికార‌ప‌క్షాన్ని దెబ్బేస్తున్నాన‌న్న హ్యాపీ ఫ్లోలో అస్స‌లు సందేహ‌ప‌డ‌లేదు.

తాజాగా ఏసీబీ అధికారులు.. రేవంత్ రెడ్డి కాల్ డేటాను చెక్ చేస్తామ‌ని చెబుతున్న సంగ‌తి తెలిసిందే. రేవంత్ ఎవ‌రితో మాట్లాడారు? ఎవ‌రితో సంప్ర‌దింపులు జ‌రిపార‌న్న కోణంలో విచార‌ణ జ‌రుపుతామ‌ని చెప్పే ఏసీబీ అధికారులు.. కుట్ర‌తో ఇరికించిన స్టీఫెన్ సెల్ ఫోన్ డేటాను ఎందుకు చెక్ చేయ‌రు?

ఓటేస్తే ఎంతిస్తావ్ అంటూ బేరం పెట్టిన స్టీఫెన్ వెనుక రాజ‌కీయ శ‌క్తులు ఉన్నాయ‌ని ఆరోపిస్తున్న నేప‌థ్యంలో.. స్టీఫెన్ కాల్ డేటాను కూడా చెక్ చేస్తే.. అస‌లు విష‌యం తెలిసి పోతుంద‌ని చెబుతున్నారు. ప్రొఫెష‌న‌ల్‌గా ప‌ని చేస్తూ.. ఆప‌రేష‌న్ రేవంత్ ఎపిసోడ్ సీడీల‌ను ఎంపిక చేసిన ఛాన‌ళ్ల‌కు వ‌చ్చేలా చేసిన యంత్రాంగం.. స్టీఫెన్ కాల్ డేటాను ప‌రిశీలించే ప‌ని చేస్తారా?

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు