ఎందుకంటే..; రేవంత్ కు బెయిల్ వ‌స్తుంద‌ట!

ఎందుకంటే..; రేవంత్ కు బెయిల్ వ‌స్తుంద‌ట!

ఆప‌రేష‌న్ రేవంత్‌రెడ్డిలో కెమేరాల‌కు దొరికిపోయిన ఆయ‌న ప్ర‌స్తుతం చ‌ర్ల‌ప‌ల్లి జైలులో ఉండ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న్ను క‌లిసేందుకు భారీగా నేత‌లు చ‌ర్ల‌ప‌ల్లికి క్యూ క‌డుతున్నారు. అయితే..బుధ‌వారం పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యేందుకు ఇష్ట‌ప‌డ‌ని రేవంత్‌రెడ్డి.. గురువారం మాత్రం కొంద‌రు పార్టీ నేత‌ల‌తో భేటీ అయ్యారు.

ఈ సంద‌ర్భంగా రేవంత్‌కు బెయిల్ వ‌స్తుంద‌న్న ధీమాను ఆయ‌న్నుక‌లిసిన నేత‌లు వ్య‌క్తం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. బెయిల్ విష‌యంపై రేవంత్ చాలా ఆశ‌గా ఉన్నార‌ని చెబుతున్నారు. మ‌రోవైపు..రేవంత్‌పై ఏసీబీ పెట్టిన కేసు చెల్ల‌ద‌ని.. బెయిల్ రావ‌టం గ్యారెంటీ అన్న ధీమాను వ్య‌క్తం చేయ‌టం రేవంత్‌కు ఊర‌ట ఇస్తోంద‌ని చెబుతున్నారు.

స్టింగ్ ఆప‌రేష‌న్లు చెల్ల‌వ‌ని గ‌తంలో సుప్రీంకోర్టు చెప్పిన విష‌యాన్ని రేవంత్‌కు నేత‌లు ఈ సంద‌ర్భంగా గుర్తు చేస్తున్నారు. ఏసీబీ విచార‌ణ మొత్తం ఏక‌ప‌క్షంగా ఉంద‌ని.. బ‌య‌ట తిరుగుతున్న ఏ4 ముత్త‌య్య‌ను ప‌రారీలో ఉన్న‌ట్లు పేర్కొన‌టం దీనికి నిద‌ర్శ‌నమ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ముత్త‌య్య స్టీఫెన్‌కు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో.. ఆయ‌న్ను అదుపులోకి తీసుకోలేద‌ని చెబుతున్నారు.  ఇక‌.. బెయిల్ విష‌యానికి వ‌స్తే.. అనుకున్న‌ట్లుగా బెయిల్ ల‌భించ‌ని ప‌క్షంలో హైకోర్టును ఆశ్ర‌యించేందుకు టీడీపీ వ‌ర్గాలు సిద్ధంగా ఉన్నాయి.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు