కేంద్రమంత్రి బాబును కలిసింది అందుకేనా?

కేంద్రమంత్రి బాబును కలిసింది అందుకేనా?

కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ హైదరాబాద్ కు రావడంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కొత్త సందేహాన్ని వినిపించారు. కేంద్ర మంత్రి నగరానికి ఎందుకు వచ్చినట్లు రామచంద్రయ్య ప్రశ్నించారు. తన మిత్రుడు చంద్రబాబుని రక్షించడానికి పీయూష్ గోయల్ ప్రయత్నిస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. గోయల్ మద్దతు ఇచ్చినా ప్రధాని నరేంద్ర మోడీ చంద్రబాబును రక్షిస్తారన్న నమ్మకం లేదన్నారు.

రేవంత్ రెడ్డి ఓటుకు నోటు వ్యవహారంలో రాష్ట్ర ప్రజలు తలవంచుకునేలా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించారని రామచంద్రయ్య ఆరోపించారు. చంద్రబాబు ఆంధ్రుల అభిమానాన్ని దిగజార్చారని, ఇంత జరిగాక కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగడం సరికాదని అన్నారు. వెంటనే తన తప్పు ఒప్పుకుని అప్రూవర్ గా మారాలని బాబుకు రామచంద్రయ్య హితవు పలికారు. చంద్రబాబు సీఎంగా ఉంటే రేవంత్ విచారణ నిష్పక్షపాతంగా జరగదన్నారు. చంద్రబాబు సర్కార్ నిండా అవినీతిలో మునిగిపోయిందని, ఆయన సీఎంగా ఉంటే... కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ అవినీతిమయమవుతాయని  విమర్శించారు.

సి. రామచంద్రయ్య తెలుగుదేశం మాజీ నేత, బీజేపీ-టీడీపీల పొత్తు కుదర్చడంలో పీయుష్ గోయల్ కీలకమైన వ్యక్తి అనే విషయం తెలిసిందే.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు