బాబు ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు..!

బాబు ఆమెకు మళ్లీ ఛాన్స్ ఇస్తున్నారు..!

మాజీ అసెంబ్లీ స్పీకర్ ప్రతిభా భారతి. చాన్నాళ్లుగా ఆమె అంతగా వార్తల్లో కనిపించడం లేదు. తాము ఒక దళిత మహిళను స్పీకర్ గా చేసిన ఘనత కలవారం అంటూ ఇప్పటికీ తెలుగుదేశం అధినేత గొప్పగా చెప్పుకొంటూ ఉంటారు. అయితే రాజకీయంగా మాత్రం ప్రతిభా భారతిరాణించలేకపోయారు. 1999 - 2004ల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ గా ఉండేవారు ప్రతిభా భారతి. అయితే ఆమె 2004 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు!

స్పీకర్ హోదాలో ఉండి ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆమె. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. తెలుగుదేశం పార్టీకి స్పీకర్ అవకాశం లేకుండా పోయింది. మళ్లీ కూడా ప్రతిభా భారతి ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తా చూపలేకపోయారు. మరి ఇలా పదేళ్లు గడిచిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మళ్లీ ప్రతిభా భారతికి అవకాశం ఇవ్వడం విశేషం. ఇటీవలేఆమెకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు ఏపీ సీఎం.

మరి కేవలం ఎమ్మెల్సీ హోదా మాత్రమే కాదట.. ఆంధ్రపద్రశ్ లెజిస్ట్లేటివ్ కౌన్సిల్ చైర్మన్ పదవిని కూడా ఆమెకే ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి కాంగ్రెస్ వ్యక్తి ఈ స్థానంలో ఉన్నాడు. ఆయన పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఈ హోదా తెలుగుదేశం పార్టీకి దక్కే అవకాశం ఉంది. దీంతో ప్రతిభా భారతికి తిరిగి అవకాశం ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. మరి పది సంవత్సరాల తర్వాత కూడా బాబు ఆమెను గుర్తుంచుకొని. ఎమ్మెల్సీ హోదాతో పాటు ఇలాంటి పదవి కూడా ఇస్తుండటం విశేషమే కదా!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు