వామ్మో.. రేవంత్ ములాఖత్ కోసం అన్ని దరఖాస్తులా..!

వామ్మో.. రేవంత్  ములాఖత్ కోసం అన్ని దరఖాస్తులా..!

నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఏసీబీకి పట్టుబడి చర్లపల్లిజైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తెలంగాణ తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కి ప్రత్యేక ఖైదీ హోదా లభించింది. ఆయన ఎమ్మెల్యే హోదాలో ఉన్నాడు కాబట్టి ప్రత్యేక ట్రీట్ మెంట్ కు కోర్టు అనుమతిని ఇచ్చింది. మరోవైపు ఆయనను కస్టడీకి కోరడానికి ఏసీబీ సిద్ధం అయ్యింది. ఈ వ్యవహారం గురించి  రేవంత్ రెడ్డిని ఏసీబీ అధికారులు విచారించనున్నట్టుగా తెలుస్తోంది.

మొత్తం కథ ఏంటి? ఎంతమంది ఎమ్మెల్యేలను కొనడానికి ప్రణాళిక రచించారు? ఎవరెవరికి ఎంత డబ్బు ఆఫర్ చేశారు.. అనే అంశాలతో ఏసీబీ అధికారులు ప్రశ్నావళి సిద్ధం చేసుకొన్నట్టుగా తెలుస్తోంది. గురువారమే ఏసీబీ రేవంత్ ను కస్టడీలోకి తీసుకొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ సంగతులిలా ఉంటే.. రేవంత్ రెడ్డితో ములాఖత్ గురించి అనేక మంది పోటీలు పడుతున్నారు.

ఒక్క రోజులోనే రేవంత్ తో ములాఖత్ కోసం ఏకంగా 50 దరఖాస్తులు వచ్చాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అటు తెలుగుదేశం నేతలు, ఇటు రేవంత్ కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు.. ఇలా అనేక మంది రేవంత్ తో ములాఖత్ గురించి జైలర్ కు విజ్ఞప్తులు చేసుకొన్నారు. వీరిలో కొందరిని కలవడానికి రేవంత్ రెడ్డి సమ్మతం తెలిపాడు. ప్రత్యేకించి తెలుగుదేశం నేతలను కలవడానికి మాత్రం రేవంత్ రెడ్డి సమ్మతించకపోవడం విశేషం. దీంతో జైలు వరకూ వెళ్లిన టీడీపీ నేతలు వెనుదిరగాల్సి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి తెలుగుదేశం ఎమ్మెల్యేలను కలవడానికి సమ్మతించపోవడం రాజకీయంగా ఆసక్తిని రేపుతున్న అంశమే!

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English