హరికృష్ణనీ బుజ్జగించవచ్చు కదా

హరికృష్ణనీ బుజ్జగించవచ్చు కదా

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత కడియం శ్రీహరి బుజ్జగించబడ్డారు. పార్టీకి దూరంగా జరగాలనే నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా వార్తలు రావడంతో, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు కలుగజేసుకుని అతన్ని బుజ్జగించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావుతో రాయబారం పంపి సఫలమయ్యారు చంద్రబాబు. కడియం శ్రీహరి విషయంలో ఇంత వేగంగా స్పందించిన చంద్రబాబు, బావమరిది హరికృష్ణ విషయంలో మాత్రం మెట్టు దిగడంలేదట. 

'నా బిడ్డను వివాదాల్లోకి లాగారు, వేధిస్తున్నారు' అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీ వివాదంపై హరికృష్ణ ఆవేదన వ్యక్తం చేయగా, దాన్ని చంద్రబాబు పట్టించుకోలేదు. హరికృష్ణ కూడా బావపై పంతానికి పోయారు. నందమూరి వంశంలో విభేదాల గురించి ఎంత రాద్ధాంతం జరుగుతున్నా, హరికృష్ణ వైపు కన్నెత్తి చూడవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు సూచించినట్లుగా కనిపిస్తున్నది పరిస్థితిని గమనిస్తే. కడియంకి బుజ్జగింపులు, తనని లెక్క చేయకపోవడంతో హరికృష్ణ ఇంకా ఆగ్రహంతో ఊగిపోతున్నార్ట. ఇదెలాంటి పరిస్థితులకు కారణమవుతుందో చూడాలిక.

 

TAGS

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English