ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్‌బస్టర్‌

ఊహించిన దానికంటే పెద్ద బ్లాక్‌బస్టర్‌

'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' బాక్సాఫీస్‌ వద్ద చేస్తున్న సెన్సేషన్‌ కంటిన్యూ అవుతోంది. మొదటి వారంతో సరిపెడుతుందని అనుకుంటే, ఈ చిత్రం రెండవ వారంలో కూడా అద్భుతాలు చేస్తోంది. పది రోజుల్లో తొంభై ఏడున్నర కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం పదకొండో రోజుతో, అంటే నేటితో వంద కోట్ల క్లబ్‌లో చేరనుంది. ఈ చిత్రం ఫుల్‌ రన్‌లో వంద కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తే, ఇప్పుడు నూట పాతిక కోట్లు వసూలు చేయడం కష్టమేం కాదనిపిస్తోంది.

చిన్న సినిమాల్లో ఇంతటి భారీ విజయాన్ని సాధించిన చిత్రమే లేదని, ఇది చిన్న సినిమాలకి మరింత ఉత్సాహాన్ని, ఊపుని ఇచ్చే విజయమని ట్రేడ్‌ వర్గాలు అంటున్నాయి. కేవలం కంగన రనౌత్‌పై ప్రేక్షకులకి పెరిగిన నమ్మకమే ఈ చిత్రానికి ఇంతటి విజయం దక్కడానికి కారణమని, ఆమె ఇప్పుడు లేడీ సూపర్‌స్టార్‌ అని కితాబులు ఇస్తున్నారు. అమితాబ్‌, దీపికలాంటి పెద్ద స్టార్స్‌ ఉన్న పీకూ చిత్ర వసూళ్లతో పాటు అక్షయ్‌కుమార్‌ నటించిన బేబీ, గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌ రికార్డులని కూడా దాటేసి ఈ ఏడాదిలో ఇప్పటికి వచ్చిన చిత్రాల్లో అతి పెద్ద విజయంగా ఇది నిలిచింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు