బాహుబలి నుంచి భాయ్‌ దాకా!

బాహుబలి నుంచి భాయ్‌ దాకా!

రాజమౌళి సక్సెస్‌లో అతని తండ్రి విజయేంద్రప్రసాద్‌ పాత్ర చాలా ఉంది. ఆయన అందించే మూలకథల్ని, ఐడియాల్నే రాజమౌళి తనదైన శైలిలో డెవలప్‌ చేసి అంతటి భారీ విజయాలు సాధిస్తుంటాడు. రాజమౌళి లేకుండా ఇటీవల కాలంలోవిజయేంద్రప్రసాద్‌ సక్సెస్‌ కాలేకపోయారనుకోండి. అది వేరే సంగతి. రాజమౌళి విజయంలో మూల విరాఠ్‌ అయిన విజయేంద్రప్రసాద్‌ మేథస్సుని వాడుకోవాలని బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ఖాన్‌ ముందుకొచ్చాడు.

అతని తాజా చిత్రం 'బజరంగి భాయ్‌జాన్‌' చిత్రానికి విజయేంద్రప్రసాద్‌ కథ అందించడమే కాకుండా స్క్రీన్‌ప్లేలో కూడా ఒక చెయ్యి వేసాడు. బాహుబలి కథ తర్వాత ఆయన రాసిన కథ ఇదే అన్నమాట. ఈ రంజాన్‌కి విడుదల కాబోతున్న బజరంగి భాయ్‌జాన్‌ ట్రెయిలర్‌ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈసారి సల్మాన్‌ ఖాన్‌ బలమైన కథ ఉన్న సినిమా చేసాడనే నమ్మకం కలుగుతోంది. కొంత కాలంగా రంజాన్‌కి బ్లాక్‌బస్టర్‌ ఇవ్వడం ఆనవాయితీగా కొనసాగిస్తోన్న భాయ్‌ ఖాతాలో మరో బంపర్‌ హిట్‌ ఖాయమని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు