దెబ్బకి ఖాన్‌దాన్‌ అంతా ఒక్కటైంది

దెబ్బకి ఖాన్‌దాన్‌ అంతా ఒక్కటైంది

సల్మాన్‌ ఖాన్‌కి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేస్‌లో శిక్ష ఖరారు కావడం... అతనిపై సానుభూతి పవనం వెల్లువెత్తడం... బాలీవుడ్‌లోని చిన్న, పెద్ద అంతా అతనికి సంఘీభావం తెలపడం.. కట్‌ చేస్తే, సల్మాన్‌కి బెయిల్‌ మంజూరు కావడం, పడిన శిక్ష కూడా రద్దు అయిపోవడం జరిగిపోయాయి. ఏదైతేనేం ఈ సంఘటన మొత్తంలో ఇప్పుడు 'భాయ్‌'కి శత్రువులు అంటూ లేకుండా పోయారు. చాలా కాలంగా ఎడమొహం పెడమొహంగా ఉంటోన్న షారుక్‌, సల్మాన్‌ ఇప్పుడు భాయ్‌, భాయ్‌ అయిపోయారు.

తనకి కష్టకాలంలో అండగా ఉండి సపోర్ట్‌ ఇచ్చిన షారుక్‌ని ఇప్పుడు సల్మాన్‌ చాలా గౌరవిస్తున్నాడు. ఆ రోజు సల్మాన్‌కి సపోర్ట్‌ ఇవ్వడంతో సరిపెట్టేయకుండా అతని కొత్త సినిమా ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ అయితే దాని గురించి ట్వీట్‌ చేసి, హీరోగా ఉండడం కంటే సోదరుడిగా ఉండడమే మిన్న అంటూ షారుక్‌ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. బజరంగి భాయ్‌జాన్‌ ఫస్ట్‌ లుక్‌ని షారుక్‌తో పాటు అమీర్‌ ఖాన్‌ కూడా ట్వీట్‌ చేసాడు. దీంతో ఖాన్‌దాన్‌ అంతా ఒక్కటైపోయిందనే సంగతి స్పష్టమైంది. రేపు షారుక్‌ సినిమా రిలీజ్‌ అయినప్పుడు సల్మాన్‌ ఎలా రుణం తీర్చుకుంటాడో చూడాలి.  

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English