బాక్సాఫీస్‌తో పేకాట ఆడేస్తోంది

బాక్సాఫీస్‌తో పేకాట ఆడేస్తోంది

ఎంత మంచి టాక్‌ వచ్చిన సినిమాకైనా కానీ విడుదలైన రోజున కంటే మొదటి ఆదివారం వసూళ్లు మహా అయితే ఒక నలభై లేదా యాభై శాతం ఎక్కువ వస్తుంటాయి. కానీ 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌' చిత్రానికి శుక్రవారం వచ్చిన వసూళ్లు ఆదివారానికి వచ్చేసరికి డబుల్‌ అయ్యాయి. మొదటి రోజు ఎనిమిది కోట్లకి పైగా వసూళ్లు రాగా, ఆదివారం పదహారు కోట్ల వసూళ్లు వచ్చాయి. శనివారం పదమూడు కోట్ల కలెక్షన్స్‌ వసూలయ్యాయి. ఇది చాలా వింతగా ఉందని బాలీవుడ్‌ టాప్‌ ట్రేడ్‌ అనలిస్టులు కూడా అవాక్కవుతున్నారు.

యాభై, అరవై కోట్ల రేంజ్‌లో ఆగుతుందని అనుకున్న ఈ చిత్రం ఇప్పుడు వంద కోట్ల వసూళ్లు సాధించే దిశగా దూసుకెళుతోందని అంటున్నారు. కంగన రనౌత్‌ నటించిన 'తను వెడ్స్‌ మను' ఫుల్‌ రన్‌లో ముప్పయ్‌ ఎనిమిది కోట్ల గ్రాస్‌ కలెక్షన్లు సాధిస్తే... సీక్వెల్‌కి మూడే రోజుల్లో ఆ వసూళ్లు వచ్చేసాయి. క్వీన్‌ కంటే కూడా కంగన కెరియర్‌లో పెద్ద హిట్‌గా ఈ చిత్రం నిలవనుంది. ఈ సినిమాతో కంగన హీరోతో పని లేకుండా వంద కోట్లు వసూలు చేసే సత్తా ఉన్న సూపర్‌స్టార్‌ అనిపించుకుంటోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English