భళా భల్లలదేవా!

భళా భల్లలదేవా!

'బాహుబలి' పాత్రల పరిచయం చివరి అంకానికి చేరుకుంది. 'బాహుబలి'గా ప్రభాస్‌ లుక్‌ తప్ప మిగిలిన అందరూ ఇందులో ఎలా కనిపించబోతున్నారనేది చూపించేసారు. ఇందులో విలన్‌ పాత్ర పోషించిన రాణా లుక్‌ని రాజమౌళి రివీల్‌ చేసాడు. గదని తిప్పుతూ తన శక్తి యుక్తులు తెలిసేలా భీకర పోరు సాగిస్తోన్న 'భల్లలదేవ' లుక్‌లో రాణా అంచనాలని పెంచుతున్నాడు. రాజమౌళి ట్వీట్‌ చేసిన కొద్ది నిముషాల్లోనే ఈ పోస్టర్‌ జాతీయ వ్యాప్తంగా ట్రెండ్‌ అయింది.

ట్విట్టర్‌లో ఇంతవరకు ఈ చిత్రానికి సంబంధించి ఏ ట్వీట్‌ వేసినా కానీ అది వెంటనే ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవడం విశేషం. ఈ చిత్రంపై అందరికీ ఎంతటి ఆసక్తి ఉందనే దానికి ఇది నిదర్శనం. ఇటు రాజమౌళితో పాటు బాలీవుడ్‌ నుంచి హిందీ బాహుబలి సమర్పకుడు కరణ్‌ జోహార్‌ కూడా ఈ చిత్ర ప్రచారంలో పాల్పంచుకుంటున్నాడు. ఈ నెల 31న ఆడియోతో పాటు ట్రెయిలర్‌ కూడా రిలీజ్‌ కానుంది. అప్పుడు ఇక బాహుబలి ఏ రేంజ్‌లో ట్రెండ్‌ అవుతుందో, ఎన్ని రోజులు ట్రెండ్‌ అవుతుందో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు