ఏడేళ్లలో సింగిల్‌ హిట్‌ లేదు పాపం

ఏడేళ్లలో సింగిల్‌ హిట్‌ లేదు పాపం

తెలుగు చిత్ర పరిశ్రమలో నంబర్‌వన్‌ హీరోయిన్‌గా వెలిగిన త్రిషకి గత ఏడేళ్లుగా ఒక్క హిట్‌ లేదు. తమిళంలో అడపాదడపా అయినా మెరుస్తోన్న త్రిష తెలుగులో 'కృష్ణ' తర్వాత నిఖార్సయిన హిట్‌ ఒక్కటీ ఇవ్వలేదు. ఒకట్రెండు యావరేజ్‌ సినిమాలు వచ్చాయి కానీ ఆమె చేసిన పెద్ద సినిమాల్లో చాలా వరకు బాల్చీ తన్నేసాయి. తీన్‌మార్‌, దమ్ము, నమో వెంకటేశ లాంటి ఫ్లాప్‌ సినిమాలతో త్రిషకి అవకాశాలు తగ్గిపోయాయి. ఆమె ప్రధాన పాత్రలో ఎమ్మెస్‌ రాజు మొదలు పెట్టిన రమ్‌ చిత్రం షూటింగ్‌ కూడా కొన్నాళ్లు జరిగిన తర్వాత ఆగిపోయింది.

ఇలాంటి టైమ్‌లో బాలకృష్ణ 'లయన్‌'తో తిరిగి బిజీ కావాలని అనుకుంది కానీ ఆ చిత్రం కలెక్షన్ల ట్రెండు చూస్తుంటే త్రిష ఆశలు నీరుగారిపోయినట్టే కనిపిస్తోంది. సినిమా ఆడడం, ఆడకపోవడం సంగతి అటుంచితే ఇందులో త్రిష చేసిన ఓవరాక్షన్‌కి విమర్శలు వస్తున్నాయి. సినిమాలో అత్యంత బ్యాడ్‌ పార్ట్‌ ఆమె ఉన్న ఎపిసోడ్స్‌ అని కామెంట్స్‌ పడుతున్నాయి. ఊహించని ఈ పరిణామంతో త్రిష లయన్‌ గురించి హంగామా చేయడం మానేసి తదుపరి చిత్రాలపై ఫోకస్‌ పెట్టింది. కోటీశ్వరుడితో పెళ్లికి రామ్‌ రామ్‌ చెప్పిన త్రిషకి ఇప్పుడు ఇలాంటి ఝలక్కులు తట్టుకోవడం కష్టమే పాపం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు