విజయశాంతి బాటలో త్రిష

విజయశాంతి బాటలో త్రిష

కొంతమంది హీరోయిన్లు కెరియర్‌ కాస్త డౌన్‌ అవ్వగానే ఏదో ఒక మ్యాజిక్‌ చేసేసి మళ్ళీ స్టార్‌ హోదాను సంపాదించుకుంటారు. అయితే చాలామంది ఒక హిట్టు సినిమాతోనే చేజారిన క్రేజ్‌ను తిరిగి తెచ్చుకుంటే, కొంతమంది మాత్రం కొత్త రకం క్యారెక్టర్లతో జెండా ఎగరేస్తారు.

కెరియర్‌ స్టార్టింగ్‌లో గ్లామర్‌ డాల్‌గా రెచ్చిపోయిన మాజీ హీరోయిన్‌ విజయశాంతి, ఆ తరువాత ఖాకీ డ్రస్సు వేసుకొని కర్తవ్యం, గన్నుపట్టి ఒసేయ్‌ రాములమ్మ వంటి సినిమాలు చెయ్యడంతో ఆమె కెరీర్‌ ఒక రేంజ్‌లో టర్నయ్యింది. హాట్‌ బ్యూటి నుండి లేడి సూపర్‌స్టార్‌గా మారిపోయింది. ఇప్పుడు అదే బాటలో తనుకూడా వెళ్ళాలని నిర్ణయించుకుందట చెన్నయ్‌ చిన్నది త్రిష. చేతిలో కేవలం రెండు మూడు చిన్న సినిమాలు తప్ప ఏమీ లేని మన డస్కీ భామ, ఎవరైనా తనకు ఐపిఎస్‌ పాత్రలో నటించే అవకాశం ఇస్తే దానిలో అతి తక్కువ రెమ్యూనరేషన్‌కే నటిస్తానంటోంది.

అసలు త్రిషను చూస్తే ఒక ఐపిఎస్‌ ఆఫీసర్‌కు కావల్సిన ఫిజిక్‌ వగైరా లేకపోయినా, సినిమాల్లో ఎలాగైనా మేనేజ్‌ చెయ్యొచ్చు. మరి ఎవరైనా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకుంటారా...?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు