బాహుబలి కొసరు గోల వదిలిపోయింది

బాహుబలి కొసరు గోల వదిలిపోయింది

'బాహుబలి' చిత్రం క్యారెక్టర్లని పరిచయం చేస్తూ రాజమౌళి ఒక్కో పోస్టర్‌ రిలీజ్‌ చేస్తుంటే ఈ చిత్రం విశేషాల కోసమని పడిగాపులు పడుతోన్న జనం ప్రతి పోస్టర్‌ కోసం ఉత్కంఠగా ఎదురు చూసారు. ప్రభాస్‌, అనుష్కతో మొదలు పెట్టిన రాజమౌళి ఆ తర్వాత అసలు క్యారెక్టర్లని పక్కన పెట్టి కొసరు పాత్రలని పరిచయం చేసే పనిలో పడ్డాడు. చివరకు ఇందులో గెస్ట్‌ రోల్‌ చేసిన సుదీప్‌ పోస్టర్‌ కూడా ఘనంగా రిలీజ్‌ చేసేసాడు. దీంతో బాహుబలిని ఒక రేంజ్‌లో చూస్తోన్న వారు కాసింత నీరసపడ్డారు.

ఇంత పెద్ద సినిమాకి ఇలాంటి చప్పటి పోస్టర్లు వదులుతున్నారేంటని డైరెక్టుగా రాజమౌళినే ట్యాగ్‌ చేసి ట్వీట్లు కూడా వేస్తున్నారు. రాజమౌళి ఇక ఆలస్యం చేయకుండా తన అసలు పాత్రలని పరిచయం చేయబోతున్నానని, ఇక మిగిలి వున్నది అవంతిక (తమన్నా), బళ్లలదేవ (రాణా), బాహుబలి (ప్రభాస్‌) మాత్రమేనని, ఆ పోస్టర్స్‌ వదిలే డేట్స్‌ కూడా ఇచ్చేసాడు. పోస్టర్స్‌ అయిపోతే ఇక మే 31న ఆడియోతో పాటు ట్రెయిలర్‌ కూడా రిలీజ్‌ చేయనున్నారు. జులై 10న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలైతే ముమ్మరంగా జరుగుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English