తాప్సీ సైడ్‌ బిజినెస్‌ మొదలెట్టింది

తాప్సీ సైడ్‌ బిజినెస్‌ మొదలెట్టింది

'గంగ'తో హిట్టయితే వచ్చింది కానీ అది తాప్సీకి సౌత్‌ సినిమా ఇండస్ట్రీలో కొత్త అవకాశాలు, పెద్ద సినిమాల్లో ఛాన్స్‌లు తెస్తుందనే నమ్మకం లేదు. బాలీవుడ్‌లో ఒకటీ అరా సినిమాల్లో చేస్తున్నా కానీ తాప్సీని అక్కడ కూడా అంత సీరియస్‌గా తీసుకోవడం లేదు. కెరియర్‌ పరంగా చెప్పుకోతగ్గ ప్రోగ్రెస్‌ లేకపోవడంతో తాప్సీ ముందు జాగ్రత్తగా వేరే వాటిలో కాలు మోపి భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటోంది. వెడ్డింగ్‌ ప్లానింగ్‌ అంటే ఇంట్రెస్ట్‌ ఉండడంతో తాప్సీ తన చెల్లెలు షగున్‌, స్నేహితురాలు ఫరాతో కలిసి వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కంపెనీ లాంఛ్‌ చేస్తోంది.

తనకి ఈ రంగం మీద ఆసక్తి ఉందని, తన స్నేహితురాలు ఫరాకి ఇందులో అనుభవం ఉందని, అందుకే ఇప్పుడు దీంట్లో ఇన్వెస్ట్‌ చేస్తున్నానని, వెంటనే తను యాక్టివ్‌ కాకపోయినా కానీ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటానని, తర్వాత ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కూడా స్టార్ట్‌ చేస్తామని అంటోంది. ఈమధ్యే కాంచన చిత్రానికి హిందీలో కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించాలని నిర్ణయించుకున్న తాప్సీ మొత్తానికి ఫ్యూచర్‌కి ఢోకా లేకుండా ఉండేలా చూసుకుంటోంది. షెల్ఫ్‌ లైఫ్‌ తక్కువ కాబట్టి ప్రతి హీరోయిన్‌కీ ఈ ముందు చూపు ఉండాలిలెండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు