ఇంకో సమంత అవుతుందా?

ఇంకో సమంత అవుతుందా?

గౌతమ్‌ మీనన్‌ చేసిన 'ఏమాయ చేసావె' సినిమాతో పరిచయమైన సమంత ఎంతటి మాయ చేసిందనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోయిన్లని తెరపై ప్రెజెంట్‌ చేయడంలో అద్భుతమైన శైలి ఉన్న గౌతమ్‌ మీనన్‌ ఇప్పుడు తను తీస్తున్న సరికొత్త ప్రేమకథతో మరో హీరోయిన్‌ని మనకి పరిచయం చేస్తున్నాడు. మలయాళంలో కొన్ని సినిమాలు చేసిన మంజిమా మోహన్‌ తెలుగు తెర మీదకి వస్తోంది.

నాగచైతన్యతో గౌతమ్‌ మీనన్‌ తీస్తున్న ఈ సినిమాలో ముందుగా సమంతనే కథానాయికగా ఎంచుకున్నారు. కానీ తమిళంలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న సమంత ఈ చిత్రానికి డేట్స్‌ సర్దుబాటు చేయలేకపోయింది. ఆకట్టుకునే ఫీచర్స్‌కి తోడు, సమంత మాదిరిగా అప్పీలింగ్‌ ఫేస్‌ ఉన్న మంజిమ కూడా సమంత మాదిరిగా క్లిక్‌ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెని ఫోటోల్లో చూస్తుంటేనే పెద్ద హీరోయిన్‌ కాగలదని అనిపిస్తోంది. ఎలాగో గౌతమ్‌ మీనన్‌ చేయి పడితే హీరోయిన్లు వెలిగిపోతారు కాబట్టి మంజిమ ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయినా ఆశ్చర్య పోవాల్సిన పని లేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు