సమంత.. అన్నిటికీ అదే ఓవరాక్షన్‌

సమంత.. అన్నిటికీ అదే ఓవరాక్షన్‌

తెలుగు చిత్ర పరిశ్రమలో అవకాశాలు తగ్గిపోవడంతో తమిళ రంగానికి షిఫ్ట్‌ అయిన సమంత వరుసపెట్టి చాలా చిత్రాలకి సైన్‌ చేస్తోంది. తమిళంలో ఒక దాని తర్వాత ఒకటిగా వస్తోన్న ఆఫర్లతో తెలుగులో సినిమాలు లేని బెంగ కొంత తీరిపోతోంది. తెలుగులో ఇచ్చే పారితోషికంలో సగానికే తమిళ చిత్రాలు సైన్‌ చేస్తోన్న సమంత ఈమధ్య తనకి ఏ అవకాశం వచ్చినా కానీ కొత్త హీరోయిన్‌లా తెగ ఇదైపోతోంది. తమిళంలో తను చేస్తున్న ప్రతి చిత్రానికీ ఇదే తన అత్యుత్తమ చిత్రమంటూ కితాబు ఇచ్చేస్తోంది. విక్రమ్‌తో చేస్తోన్న సినిమానే తన బెస్ట్‌ మూవీ అంటూ సమంత స్టేట్‌మెంట్‌ ఇచ్చి ఎంతో కాలం కాలేదు.

ఇంకా ఆ చిత్రం విడుదలై సమంత ఏమాత్రం నటించేసిందో మనర చూడనేలేదు. ఈలోగా ధనుష్‌తో కలిసి వేల్‌రాజ్‌ డైరెక్షన్‌లో చేస్తున్న సినిమానే తన కెరియర్‌లో బెస్ట్‌ మూవీ అవుతుందని సమంత ప్రామిస్‌ చేసేసింది. ఏదో ఒక్క సినిమాకి ఇలాంటి స్టేట్‌మెంట్‌ ఇస్తే ఓకే కానీ ప్రతి దానికీ ఇదే ఓవరాక్షన్‌ అంటే కేవలం డెస్పరేషన్‌లోనే ఇలా అంటోందని అనుకునే అవకాశముంది. ఏదేమైనా తెలుగులో మహరాణిలా వెలిగిన సమంత ఇప్పుడు రెండో శ్రేణి హీరోయిన్‌ స్టేటస్‌కి అడ్జస్ట్‌ అవడానికి పాపం బాగానే ఇబ్బంది పడుతున్నట్టుంది.