అనసూయ దెబ్బకు మళ్లీ అవుట్‌

అనసూయ దెబ్బకు మళ్లీ అవుట్‌

ఈ మధ్యలో తెలుగు సినిమాల ఆడియో ఫంక్షన్లకు రావాలంటేనే మన హీరోయిన్లకు బయమేస్తోందట. ఎందుకంటే పొరపాటున ఆ కార్యక్రమానికి సెక్సీ భామ అనసూయ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తే మాత్రం అక్కడకు వెళ్ళినా మనకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదంటున్నారు హీరోయిన్లు. రీసెంట్‌, అనసూయ దెబ్బకు ఇలానే ముగ్గురు హీరోయిన్లు అవుటైతే, ఇప్పుడు మరో ముగ్గురకు అదే జరిగింది.

బుల్లితెర నుండి కుర్రాళ్ళ మనస్సులో ఆటంబాంబ్‌ వేసిన హాట్‌ బ్యూటి అనసూయ, ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్‌ టాపిక్‌గా మారింది. పొట్టి డ్రస్సుల్లో, లేకపోతే పలుచటి చీరల్లో తన అందాలను ఎరవేస్తూ, ఏ కార్యక్రమానికి వెళ్ళినా అక్కడ సెంటర్‌ ఆఫ్‌ ఎట్రాక్షన్‌గా మారిపోతోంది. ఆ మధ్య పార్క సినిమా ఆడియో ఫంక్షన్‌లో ఇలానే చేసిన అనసూయ, నిన్న తాజాగా డికె బోస్‌ ఆడియో ఫంక్షన్లో తన అందాలతో అందర్ని తనవైపు తిప్పేసుకుంది.

అక్కడకు వచ్చిన హీరోయిన్లు నిషా అగర్వాల్‌, రెజీనా, రకుల్‌ప్రీత్‌ సింగ్‌లను ఒక్కరైనా పట్టించుకుంటే ఒట్టు. చూస్తుంటే త్వరలోనే తెలుగు సినిమా హీరోయిన్స్‌ అసోసియేషన్‌ అనుసూయపై వేటు వేస్తుందేమో... లేకపోతే ఈ భామ అసలకే ఎసరు పెట్టేలా ఉంది.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English