కొత్త సినిమాపై ఫ్లాప్‌ సినిమా ఎఫెక్ట్‌

కొత్త సినిమాపై ఫ్లాప్‌ సినిమా ఎఫెక్ట్‌

రామ్‌ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతోన్న 'పండగ చేస్కో' చిత్రంపై అంతటా పాజిటివ్‌ బజ్‌ ఉంది. ఈ చిత్రం ట్రెయిలర్స్‌లో హిట్‌ కళ కనిపిస్తోందని అందరూ అంటున్నారు. అయితే సదరు నిర్మాత తీసిన గత చిత్రం దారుణమైన పరాజయం చవిచూడడంతో ఆ సెగ ఇప్పుడు ఈ చిత్రానికి తగులుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. పరుచూరి కిరీటి నిర్మించిన 'షాడో' ఎంత పెద్ద డిజాస్టర్‌ అయిందో తెలిసిందే. ఆ చిత్రం పరాజయంతో చాలా గ్యాప్‌ తీసుకుని 'పండగ చేస్కో' మొదలు పెట్టారు. అయితే ఈ చిత్రానికి పేమెంట్స్‌ సరిగా జరగడం లేదని గాసిప్స్‌ ఉన్నాయి.

రామ్‌కి పూర్తి పారితోషికం ఇవ్వలేదని, అతను డబ్బింగ్‌ చెప్పడానికి అంగీకరించలేదని కొద్ది రోజుల క్రితం పుకార్లు వచ్చాయి. అయితే అవి సర్దుబాటు అయి అన్నీ సవ్యంగా జరుగుతున్నాయని అనుకునేలోగానే ఈ నిర్మాత ఇచ్చిన చెక్కులు కొన్ని బౌన్స్‌ అయ్యాయనే ప్రచారం మొదలైంది. సినిమాకి హిట్‌ కళ కనిపిస్తున్నా కానీ ముందు తీసిన ఫ్లాప్‌ సినిమా వల్ల పడుతోన్న ఇబ్బందులు అయి ఉండొచ్చు. అయితే రామ్‌తో పాటు గోపీచంద్‌ మలినేని ఈ చిత్రం తప్పకుండా బ్రహ్మాండమైన విజయాన్ని అందుకుంటుందనే ధీమాతో ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు